ఏపి ఎలక్షన్లకు ముందు జరుగిన ప్రచారంలో ఓ నినాదం చాలమంది ప్రజలను ఆకట్టుకుంది.అదేంటంటే కావాలి జగన్,రావాలి జగన్..ఆతర్వాత నిజంగానే వారి ఆశను నిజం చేశారు జగన్.కోట్లమంది గొంతుకలు ఒక్కటై అందించిన ఆశీస్సులతో జగన్ వచ్చాడు సీయం అయ్యాడు.ఇక ఆనాటి నుండి నేటి వరకు తన పాలనలో సరికొత్త మార్క్‌తో ముందుకు వెళ్లుతున్నాడు.వృద్దులను అవ్వా అనిపలకరించిన జగన్ ఇప్పుడు వారి కంట్లో ఆనందాన్ని నింపాడు.



మొదట వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే ఫించన్ల పెంపు ఫైల్‌పై తొలి సంతకం చేశారు.రూ.2000 ఇస్తోన్న పెన్షన్‌ను రూ.2250కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ఏటా రూ.250 చొప్పున పెంచుతూ పోతామని జగన్ తెలిపారు.కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తొలి రెండు నెలల్లో పెన్షన్ల విడుదలలో కాస్త జాప్యం తలెత్తింది.దాంతో ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు.తమ హయాంలో పంచాయతీ కార్యదర్శి,బిల్ కలెక్టర్లు, వీఆర్వోలు ఒకటో తేదిన పెన్షన్లు అందించేవారని,ఇప్పుడు వారం గడిచినా పెన్షన్లు అందడం లేదని టీడీపీ నేతలు ఆరోపించారు.ఈ విమర్శలకు సీఎం వైఎస్ జగన్ సరైన సమాధానం ఇచ్చారు.



సెప్టెంబర్ 1 నుంచి నేరుగా లబ్ధిదారులకు వారి ఇంటి వద్దే పెన్షన్లు అందనున్నాయి.ఇక నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను అందజేస్తారు. ఇప్పటికే సెప్టెంబర్లో పెన్షన్ల విడుదల కోసం ఏపీ ప్రభుత్వం రూ.1280 కోట్లను విడుదల చేసింది.ఇక ఫించన్లకు వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా పేరు మార్చిన జగన్ సర్కారు.. జూలైలో రాజశేఖరెడ్డి జయంతి రోజున అంటే జూలై 8న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించిందన్న విషయం తెలిసిందే..ఇక ఈ ఫించన్‌ల విషయం తెలిసిన వృద్ధులు, పెద్దవారి ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి.కొంతమందైతే అచ్చం రాజన్నను చూసినట్టే అనిపిస్తుందని,పొగుడుతూ ,పేదవారికోసం పేదరికంలో ఉన్న పెద్దవారికోసం ఇంతలా ఆలోచించే జగన్ సీయం కాదు మా కొడుకు లాంటివాడని నిండు నూరేళ్ళు చల్లగా వుండాలని  దీవెనలని అందిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: