ముంబై ఇండియాలో ఉంటె కరాచీ పాకిస్తాన్ లో ఉన్నది.  ఈ రెండింటికి మధ్య చాలా దూరం ఉంది.  ఏకం కావడం అసంభవం.  పైగా ఇప్పుడు రెండు దేశాల మధ్య అసలు ఏమి వేయకుండానే మంటలు అంటుకుంటున్నాయి.  రేపోమాపో యుద్ధం కూడా రావోచ్చ అంటున్నారు.  ఇలాంటి సమయంలో ముంబై.. కరాచీలు ఎలా కలుస్తాయి.. ఏ విధంగా కలుస్తాయి.. ఈ ఆలోచనకు అర్ధం ఏంటి.. పాక్ విషయంలో ప్రధాని ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అనే డౌట్స్ రావొచ్చు.  


విషయం అది కాదు. ఇటీవలే ఎకానమిస్ట్ ఇంటిలిజెన్స్ యూనిట్ ప్రపంచంలో నివాసానికి అత్యంత సురక్షితమైన నగరాలు ఏవి అనే దానిపై సమగ్ర సర్వేను నిర్వహించి ఓ నివేదికను తయారు చేసింది.  ఈ లిస్ట్ ప్రకారం అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలో జపాన్ రాజధాని టోక్యో మొదటి ప్లేస్ లో ఉన్నది.  ఎవరైనా హ్యాపీ లైఫ్ ను గడపాలి అంటే టోక్యో వెళ్లిపోవచ్చు.  అక్కడి ప్రకృతి కూడా బాగుంటుంది.  


ఇక, రెండో స్థానంలో సింగపూర్, మూడో స్థానంలో ఒసాకా, నాలుగో స్థానంలో ఆమ్ స్టర్ డామ్ లు ఉన్నాయి.  అయితే, అనూహ్యంగా ఈ టాప్ 10 నగరాల జాబితాలోకి అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ కూడా చేరింది.  ఈ నగరం ఏడో ప్లేస్ లో నిలిచింది.  2017లో టాప్ 9 గా ఉన్న హాంకాంగ్ నగరం, అక్కడ జరుగుతున్న అలజడులు కారణంగా 20 వ స్థానానికి పడిపోయింది.  టాప్ 10 నగరాల పరిస్థితి పక్కన పెడితే.. 


ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇండియా.  ఇండియాలో అనేక నగరాలు ఉన్నాయి.  వాటిల్లో సేఫ్ గా ఉండే నగరాలు లేవా అంటే ఉన్నాయి.. ముంబై నగరం అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలో 48 వ స్థానంలో ఉండగా, రాజధాని నగరం ఢిల్లీ 52 వ స్థానంలో నిలిచింది. ఇక ఉపఖండంలో బాంగ్లాదేశ్ రాజధాని ఢాకా 56 వ స్థానంలో ఉంటె.. కరాచీ నగరం 57 వ స్థానంలో ఉన్నది.  ఇండియాలో ముంబై ఎలాగైతే వాణిజ్య నగరంగా ఉన్నదో.. కరాచీ కూడా పాకిస్తాన్ లో వాణిజ్య నగరంగా పేరు తెచ్చుకున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: