డబ్బులు ఊరికే రావు?  ఎక్కడి నుండి తెస్తారు. 72 ఏండ్ల సంధి ఉన్నోడు ఉన్నోడే అయ్యాడు. లేనోడు  లేనివాడిగానే  మిగిలిపోయాడు. పొరపాటు చేసిన, నేరం చేసిన, శిక్షకు శిక్ష కాదు ..సమాధానం .కాదని  భారతీయ మజ్డూరు సంఘ్ తెలంగాణ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి అన్నారు. హైదరాబాద్ లో అమలుకు తీసున్న ట్రాఫిక్ రూల్స్ ను తీవ్రంగా ఆక్షేపించారు. పరివర్తన దిశగా ఈ రోజు ఆలోచించాల్సిన  అవసరం ఎంతైనా ఉందన్నారు. పట్టుపడిన వారు కరడు కట్టిన  నేరస్తులు  కారు కదా అని ప్రశ్నించారు. నగర పోలీస్ నిర్వాకంపై కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడారు.





ఆ చలాన్లు ఈ చలాన్లు అంటూ వసూల్ రాజాలం అవుతున్నామా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. శిక్షల్లో మార్పు రావాలని డిమాండ్ చేశారు. 
అన్ని పైసల్ యాడ  నుండి తెస్తారు అని నిలదీశారు. సమయానికి  ఉండాలి. ఏమరుపాటు ఉండవచ్చు ,భార్యాభర్తల గొడవ ,పిల్లల ఆలోచన, ఆర్థిక ఇబ్బందులు, ఎదో ఒక ఆలోచనలో హెల్మెట్  మర్చిపోవడం , మీరే బగ్గ తాగండి అని పర్మిట్  రూమ్ లు పెడితిరి అని ఎద్దేవా చేశారు. లైసెన్సు,సిటు,బెల్టు, అధిక స్పీడు,భీమా లేకపోవడం ,ఫోన్ మాట్లాడటం...ఇలా..1౦౦౦  నుండి 25,౦౦౦ వేల రూపాయల వరకు జరిమానాల విధింపు, పెంపు ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.




సామాజిక శిక్షల పరంగా  ఆలోచించాలి ...1.రోడ్లు ఊడిపించడం. 2.ట్రాఫిక్ నియంత్రణ పాత్ర. 3 పబ్లిక్ టాయిలెట్స్  కడిగించడం.  
4 .పబ్లిక్ పార్క్  లలో చెట్లకు  నీళ్ళు పట్టడం.5.షూలకు పాలిష్  చేయడం. 6.100చెట్లను నాటించి  సంరక్షించే బాధ్యత ఇవ్వడం..ఇలాంటి సామాజిక శిక్షలతో  "సిగ్గు భయంతో " మార్పు సాధ్యం అవుతాదని అయన అభిప్రాయపడ్డారు. అంతే కాని ఈ విధమైన  జరిమానాలు ప్రమాదకరమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మరొక్కసారి  ఆలోచించాలన్నారు. సామాజిక శిక్ష ..మనిషిలో పరివర్తనను కలిగిస్తుందని రవి శంకర్ చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: