సాధారణంగా జంతువులు వాటి నైజాన్ని మార్చుకోవు.  జింక మాంసం తినదు.. సింహం గడ్డి తినదు.  అడవికి రాజు సింహం.  ఆహరం దొరక్కపోతే తిండి తినడం మానేసి మరణిస్తుందేమోగాని, గడ్డ మాత్రం తినదు.  ఇక్కడ గడ్డి తినడం అంటే.. రెండు మూడు రోజు క్రితం చంపిన దాన్ని తినదు అని అర్ధం.  తాను వేటాడి తెచ్చుకొని తింటుంది.  


అందుకే అంటారు బ్రతికితే సింహంలా బ్రతకాలి అని.  ఇక మనుషుల విషయానికి వస్తే అవసరాల కోసం ఎన్నో అడ్డదార్లు తొక్కుతూ.. జంతువులకు ఇవ్వాల్సిన దాణాను సైతం మేస్తూ ఆస్తులు కూడబెడుతుంటారు.  చివరకు దేనికి కాకుండా కటకటాల పాలవుతుంటారు. సింహం గడ్డి తినదు అంటున్నారు కదా.. ఓసారి అలా చూడండి సింహం ఎంచక్కా మేకలా గడ్డిని నమిలేస్తుంది .. దీనికి ఏం సమాధానం చెప్తారు అని అడగొచ్చు. 

సింహాలు ఇలా గడ్డి ఎందుకు తింటాయో తెలిస్తే అందరు షాక్ అవుతారు.  మనం ఏదైనా తిన్న తరువాత అరగలేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు వేసుకొని అరిగించుకుంటాం.  లేదంటే వాంతులు చేసుకుంటాం.  మనకంటే బ్రెయిన్ ఉన్నది.. డాక్టర్ దగ్గరి వెళ్లి మందులు కొని వేసుకుంటాం.  మరి జంతువుల పరిస్థితి ఏంటి.. వాటికి అప్పుడప్పుడు తిన్నది అరక్కపోవచ్చు.  


సింహంలాంటి జంతువుల విషయంలో ఇంకాస్త అడ్వాన్స్ అని చెప్పొచ్చు.  సింహం వేటాడి పచ్చి మాంసాన్ని తింటుంది.  ఒక్కోసారి తిన్న మాంసం అరక్కపోతే.. ఇలా గడ్డి తింటుంది.  గడ్డి దానికి వాంతి చేసుకునే ఔషధంగా పనిచేస్తుంది.  తిన్నది బయటకు వచ్చేందుకు ఈ గడ్డి ఎంతగానో ఉపయోగపడుతుంది.  శాఖాహార జంతువులు గడ్డి తినడం వలన వాటి జీర్ణ వ్యవస్థ చాలా బాగుంటుంది.  అందుకే మాంసాహారులుగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు శాఖాహారులుగా మారిపోతున్నారు. మాంసాహారం వద్దు శాఖాహారం ముద్దు అని స్లొగన్ పట్టుకొని వీధుల వెంట తిరుగుతున్నారు కూడా.  


మరింత సమాచారం తెలుసుకోండి: