ప్ర‌పంచంలోక‌ల్లా అత్యున్న‌త రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిర్మిద్దామ‌ని క‌ల‌లుక‌న్నారు నారా చంద్ర‌బాబు. అయితే ప్ర‌స్తుతం ఆ క‌ల క‌ల‌గానే మిగిలిపోయింది. ఈ విష‌యంలో చంద్ర‌బాబుకు నిరాశే ఎదురైన‌ట్లుంది. దీంతో చంద్ర‌బాబు టిడిపి శ్రేణుల‌తంతా జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై ప్ర‌త్య‌క్ష యుద్ధానికి త‌ల‌ప‌డ్డారు. అమ‌రావ‌తిని ప్ర‌పంచంలో అత్యుత్త‌మ రాజ‌ధానిగా నిర్మించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కీర్తిని ద‌శ దిశ‌గా వ్యాపించాల‌నె క‌ల‌గా చెప్పుకున్నారు.  ఉమ్మ‌డి రాష్ట్రంలో హైద‌రాబాద్ న‌గ‌రాన్ని హైటెక్ సిటీని ఘ‌నత త‌న‌దేన‌ని చంద్ర‌బాబు గ‌తంలో అనేక సార్లు చెప్పారు. అయితే అమ‌రావ‌తి నిర్మాణం పూర్తికాక ముందే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం విశ్వ‌స‌నీయ‌త‌కోల్పోంది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టిడిపి పార్టీకి ఘోర ప‌రాజ‌యం రావ‌డంతో  150 నుంచి శాస‌న‌స‌భ్య‌ల‌తో జ‌గ‌న్ ప్ర‌భుత్వం భారీ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకుని తాము ఆడిందేఆట పాడిందే పాట‌గా ఉంది. జ‌గ‌న్ ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో ఎక్క‌డా కూడా అమ‌రావ‌తి గురించి ప్ర‌స్ధావ‌న లేదు. ప్ర‌స్ధావ‌న లేక‌పోయినా ప్ర‌జ‌లు జ‌గ‌న్‌ను గెలిపించారు.  అందుకే జ‌గ‌న్ ఇంత‌వ‌ర‌కు కామెంట్ చెయ్య‌లేదు. అటు పార్టీలు, ఇటు ప్ర‌జ‌లు ఎంతో ఉత్కంఠ‌తో ఏపి ముఖ్య‌మంత్రి రాజ‌ధాని పై ప్ర‌క‌ట‌న చేస్తార‌ని ఆశిస్తున్నారు. 


ఇదిలా ఉండ‌గా రాజ‌ధాని ప్రాంతంలో అంద‌రూ ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారై వారి ల‌బ్ధి కోసం జ‌గ‌న్ ఎందుకు అమ‌రావ‌తి నిర్మిస్దార‌ని కొంద‌రి వాద‌న‌. చంద్ర‌బాబు క‌ల‌లు కంటే జ‌గ‌న్ ఎందుకు నెర‌వేర్చాలంటూ మ‌రి కొంద‌రి అభిప్రాయం. ఎవ‌రి క‌ల‌లు ఎవ‌రు క‌న్న‌ప్ప‌టికీ గ‌త ప్ఱ‌భుత్వాన్ని న‌మ్మి రైతులు 33 ఎక్రాలు రాజ‌ధానికి ఇచ్చారు. ప్ర‌స్తుతం రైతుల ప‌రిస్థితి అమోమ‌యంలో ప‌డింది. బాధ్య‌త గ‌ల మంత్రి ప‌ద‌విలో ఉన్న‌వారు ప్ర‌జ‌ల ఆందోళ‌న‌ను అయోమ‌య ప‌రిస్థితిని స‌ర్ధుబాటు చేసి ప్ర‌జా వెతిరేక విధానాన్ని అవ‌లంభించ‌కుండా ఉండాల‌ని మేధావుల సూచ‌న. ఇప్ప‌టికే అమ‌రావ‌తిలో ప్ర‌జాధ‌న‌మ్ 10,000కోట్ల‌కి పైగా వినియోగించాము. మ‌రికొన్ని ప్రాజెక్టుల‌కు అనుమ‌తి కూడా వ‌చ్చింది. ఈ నేప‌ధ్యంలో రాజ‌ధానిగా  అమ‌రావ‌తిని మార్చ‌డం వ‌ల్ల ప్ర‌భుత్వం పైన పెను భారం ప‌డే అవ‌కాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: