ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పరిస్ధితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రతిపక్ష నేత పాత్రను సమర్ధవంతంగా పోషించటంలో కన్నా ప్రతి విషయంలోను జగన్మోహన్ రెడ్డిని ఎలా అన్ పాపులర్ చేయాలన్న విషయం మీదే మొత్తం ధ్యాసం పెడుతున్నారు. దాంతోనే జనాల్లో చంద్రబాబు అనుభవం మీద మిగిలిన కాస్త నమ్మకం కూడా పోతోంది.

 

అధికారంలో ఉన్నంత కలం జనాలను మాయచేసి పబ్బం గడుపుకోవాలని అనుకున్నారు. అందుకనే జరగని వాటిని జరిగిపోతున్నట్లు చేయని పనులను తాను చేసేస్తున్నట్లు జనాలను భ్రమల్లో ముంచే ప్రయత్నంచేశారు. చంద్రబాబు ఏమి చేసినా బ్రహ్మండమంటూ భజన చేసే ఎల్లోమీడియా అండ ఉండటంతో జనాలను పిచ్చోళ్ళను చేసేయొచ్చని భ్రమపడ్డారు.

 

సీన్ కట్ చేస్తే, ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ గూబ గుయ్యిమనిపించారు జనాలు. అంటే అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు చేసిన మాయలేవీ జనాల ముందు పనిచేయలేదు. చివరకు ఎల్లోమీడియా కూడా చంద్రబాబును కాపాడలేకపోయాయి.  గోబెల్స్ ప్రచారం తన మీడియా ఏవీ అక్కరకు రాకపోవటంతోనే తాను ఓడిపోయానన్న విషయాన్ని చంద్రబాబు మరిచిపోయారు. దాంతో ఆ ఉక్రోషాన్ని ఇపుడు జగన్మోహన్ రెడ్డి మీద చూపుతున్నారు.  

 

అందుకనే  జగన్ కు పరిపాలనలో అనుభవం లేదని, సిఎంగా జగన్ ఫెయిలయ్యాడని ఒకటే గోల పెడుతున్నాడు చంద్రబాబు. అయినదానికి కానిదానికి జగన్ పై బురద చల్లి చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారు. జగన్ కు సంబంధం లేని అంశాల్లో కూడా సిఎంగా జగన్ ఫెయిలయ్యాడనే పదే పదే ఆరోపిస్తున్నారు. కావాలనే తన మీడియాతో జగన్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.

 

నిజానికి జగన్ ఫెయిలయ్యాడని అనుకోవాల్సింది జనాలే కానీ చంద్రబాబు కాదు. సిఎంగా చంద్రబాబు ఫెయిలయ్యాడని జనాలు అనుకోబట్టే జగన్ కు పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జగన్ ఫెయిల్ అని నిరూపించేందుకు చంద్రబాబు చేసిన కొన్ని చీప్ ట్రిక్స్ వికటించి తండ్రి, కొడుకులకే చుట్టుకున్నాయి. అయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. చూస్తుంటే చంద్రబాబు ప్రతిపక్ష నేతగా కూడా ఫెయిలయినట్లే కనిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: