తెలుగు దేశం హ‌యాంలో అమ‌రావ‌తి రాజ‌ధానిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జ‌రిగిందంటూ మంత్రి బొత్స వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.  మాజీ కేంద్ర మంత్రి అప్ప‌టి టిడిపి రాజ్యస‌భ స‌భ్యుడు సుజ‌నాచౌద‌రి పై  మ‌రియు బాల‌కృష్ణ వియ్యంకుడి పై ఇటీవ‌లె ప్రెస్‌మీట్‌ను ఏర్ప‌టు చేసి మంత్రిబొత్స ఆధార‌ల‌తో కూడిన డాక్యుమెంట్లు చూపించారు.బాల‌కృష్ణ వియ్యంకుడి పై బొత్స వ్యాఖ్య‌లు


తెలుగు దేశం హ‌యాంలో అమ‌రావ‌తి రాజ‌ధానిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జ‌రిగిందంటూ మంత్రి బొత్స వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.  మాజీ కేంద్ర మంత్రి అప్ప‌టి టిడిపి రాజ్యస‌భ స‌భ్యుడు సుజ‌నాచౌద‌రి పై  మ‌రియు బాల‌కృష్ణ వియ్యంకుడి పై ఇటీవ‌లె ప్రెస్‌మీట్‌ను ఏర్ప‌టు చేసి మంత్రిబొత్స ఆధార‌ల‌తో కూడిన డాక్యుమెంట్లు చూపించారు. ఈ సంద‌ర్భంగా బొత్స మాట్లాడుతూ... కేవ‌లం చంద్ర‌బాబు నాయుడు బంధువ‌ర్గానికి మేలు చెయ్యాల‌నే దూర‌దృష్టితో అమ‌రావ‌తి ప్ర‌క‌టించటానికి ముందుగా వారంద‌రికీ స‌మాచారాన్ని పేర్కొన్నారు. దీంతో చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గం అప్ప‌టి చంద్ర‌బాబు మంత్రివ‌ర్గం స‌హ‌చ‌రులంద‌రు అమ‌రావ‌తి చుట్టుప‌క్క‌ల వేలాది ఎక‌రాలు అక్క‌డే రైతుల్ని బెదిరించి కొనుగోలు చేశార‌ని అన్నారు. అందుక‌ని చంద్ర‌బాబుకు అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్మించ‌డానికి కార‌ణ‌మ‌ని వాళ్లంద‌రికీ ల‌బ్ధి చేకూర్చ‌డానికి ఇన్‌సైడ్ ట్రేడింగ్ కోరార‌ని ప్ర‌భుత్వ నిధులని దుర్వినియోగం చేశార‌ని పెద్ద ఎత్తున కుంభ‌కోణం జ‌రిగిందని దీని పై విచారం చేప‌డ‌తాన‌ని కొద్దిరోజుల్లో అంద‌రి గుట్టు బ‌య‌ట‌పెడ‌తాన‌ని మంత్రి బొత్స కొత్త వివాదానికి తెర‌లేపారు. దీంతో మాజీ కేంద్ర మంత్రి సుజ‌నాచౌద‌రి వివ‌ర‌ణ ఇస్తూ అమ‌రావ‌తి రాజ‌ధానికి చెందిన 29 గ్రామాల‌లో త‌న‌కుగాని త‌న బంధువుల‌కి గాని  ఒక సెంటు భూమి లేద‌ని అన్నారు. మంత్రి చూపించిన చోట 10 ఎక‌రాల భూమి అమ‌రావ‌తికి వంద కిలోమీట‌ర్ల దూరంలో నందిగామ అసెంబ్లీ ని మా ద‌గ్గ‌ర‌లో చంద్రాల‌పాడు గ్రామంలో ఉంద‌ని అన్నారు.


 అది ఇప్ప‌టి భూమి కాద‌ని మా తాత‌ల కాలం నుంచి ఉంద‌ని అది మా అన‌న‌వ‌దిన‌ల పేర్ల‌తో ఉంద‌ని అది కూడా నా పేరుతో లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. రాజ‌ధాని అమ‌రావ‌తికి సుజ‌నాచౌద‌రి భూముల‌కు సంబంధం లేద‌నే వాద‌న అటు టిడిపి ఇటు బిజెపి శ్రేణులు కూడా స‌మ‌ర్ధించారు. మ‌రో వివాదం బాల‌కృష్ణ అల్లుడు భ‌ర‌త్ మాట్లాడుతూ మంత్రిగారు 493 ఎక‌రాలు మా తాత‌గారు ఎంవిఎస్‌మూర్తిగారు రాష్ట్రం విడిపోక‌ముందు అప్ప‌టి కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి సిఫార్సు చెయ్య‌గా ఎక‌రం 40,000 నుంచి 50, 000 ఉండ‌గా ప్ర‌భుత్వం మాకు ఎక‌రానికి ల‌క్ష‌రూపాయ‌లు చ‌ప్పున కేటాయించ‌డం జ‌రిగింది.  
భ‌రత్ మాట్లాడుతూ... జ‌గ‌న్ ప్ర‌భుత్వం వారి మంత్రి వ‌ర్గం ఆధారాలు లేని వివాదాలు సృష్టిస్తూ ప‌బ్బం గ‌డుపుకుంటున్నారు. జ‌గ్గ‌య్య‌పేట గ్రామం అంటే దాదాపు తెలంగాణ ప్రాంతం స‌రిహ‌ద్దుల్లో ఉన్న‌వి. రాజ‌ధాని అమ‌రావ‌తికి మేము తీసుకున్న భూముల‌కి అప్ప‌టి తెలుగు దేశం సంబంధం లేద‌ని మంత్రి వ్యాఖ్య‌ల‌కు బాల‌కృష్ణ అల్లుడు వివ‌ర‌ణ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: