చంద్రబాబునాయుడు ఉద్దేశ్యపూర్వకంగా ’జె’ ట్యాక్స్ బురదను వైసిపికి పులమటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలుగుదేశంపార్టీ హయాంలో గుంటూరు జిల్లాలో ’కే’ ట్యాక్స్ అమలవుతోందని జనాలు నెత్తి నోరు మొత్తుకున్న విషయం తెలిసిందే. ఐదేళ్ళు అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న కోడెల శివప్రసాదరావు, ఆయన్ను అడ్డుపెట్టుకుని కొడుకు, కూతురు ఏ స్ధాయిలో అరాచకాలకు పాల్పడ్డారో అందరూ చూసిందే.  కే ట్యాక్స్ బాధితుల్లో మామూలు జనాలే కాకుండా చివరకు తెలుగుదేశంపార్టీ నేతలు కూడా ఉన్నారు.

 

కే ట్యాక్స్ వ్యవహారం వల్లే జిల్లాలో టిడిపికి బాగా నష్టం జరిగింది. కే ట్యాక్స్ ను అరికట్టటంలో చంద్రబాబు చేతకానితనం కూడా ఉంది. టిడిపిని ఘోరంగా ఓడించి అధికారంలోకి వచ్చిన వైసిపిపై చంద్రబాబునాయుడు అండ్ కో బాగా ఉక్రోషం పెంచుకున్నారు. మూడు నెలలుగా జగన్ పై బురద చల్లటానికి చాలానే ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు.

 

అందుకనే తాజాగా జె ట్యాక్స్ అంటూ కొత్త బురద పులమటానికి ప్రతయత్నాలు మొదలుపెట్టారు. చంద్రబాబు చెబుతున్న సిమెంట్ బస్తాకు 10 రూపాయల జే ట్యాక్స్ కట్టేవరకూ ఇసుకకు జగన్ కృత్రిమ కొరతను తీసుకొచ్చారని చంద్రబాబు ఆరోపణ.   వాళ్ళ హయాంలో యూనిట్ ఇసుకను రూ 1200కే సరఫరా చేస్తే ఇపుడు రూ. 10 వేలయ్యిందట. ఒకవైపు ఇసుక అందటం లేదని చెబుతునే మరోవైపు యూనిట్ ధర 10 వేల రూపాయలని చెప్పటంలో అర్ధమేలేదు.

 

ఇసుక కొరత వల్ల నిర్మాణాలన్నీ ఆగిపోవటంతో సిమెంట్, స్టీలు ధరలు కూడా తగ్గిపోయాయని ఒకవైపు ఎల్లోమీడియానే చెబుతోంది. ఇంకోవైపేమో సిమెంటు బస్తా ధరకు 10 రూపాయల జే ట్యాక్స్ అని చంద్రబాబు చెబితే ఎవరు నమ్ముతారు ? కే ట్యాక్స్ టిడిపిని గట్టిగా దెబ్బ కొట్టింది కాబట్టి వైసిపి పై ఏదో ఓ రకంగా బురద చల్లాలన్న దురాలోచనతో చంద్రబాబు జే ట్యాక్స్ అనే దాన్ని తెరపైకి తెచ్చారు. చంద్రబాబు మరచిపోయిన విషయం ఒకటుంది. కోడెల కుటుంబం అరాచకాలతో నష్టపోయిన బాధితులు, టిడిపి నేతలే కే ట్యాక్స్ అన్న పదాన్ని తెరపైకి తెచ్చారు. దానికి వైసిపి నేతలు ప్రాచుర్యం కల్పించారంతే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: