ఓ ఎంపీపై దొంగతనం కేసు నమోదు కావడం అంటే మాములు విషయం కాదు.అలాంటిది ఉత్తర ప్రదేశ్ రాంపూర్ ఎంపీ ఆజాం ఖాన్ పై పలుసార్లు దొంగతనం కేసులు నమోదయ్యాయి.అది కూడ ఆయన స్వంత నియోజకవర్గంలోనే అవుతున్నాయి. తాజాగా అజాంఖాన్ మరో కేసులో ఇరుక్కున్నాడు.రాంపూర్‌లో అజాంఖాన్ తోపాటు, ఆయన అనుచరులు తమ ఇంటి మీదకు వచ్చి దాడి చేసి,రూ.25000 నగదుతోపాటు,ఇంటిబయట ఉన్న గేదేలను కూడ పట్టుకుని పోయారని ఓ కుటుంబం ఆయనపై కేసును పెట్టింది..



వివరాల్లోకి వెళితే రాంపూర్‌లోని ఆసిఫ్ మరియు జకీర్ ఆలీలకుటుంబం అద్దెఇంట్లో గతకొన్నాళ్లుగా చట్టపరంగా నివసిస్తున్నా రు.అయితే అక్కడి స్థలంలో ప్రభుత్వం, స్కూల్ నిర్మించేందుకు నిర్ణయించింది.దీంతో ఆసీఫ్ కుటుంబం ఆ ఇల్లును ఖాళీ చేసేందుకు నిరాకరించడంతో అజాంఖాన్ అనుచరులు దాడి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.ఈ కేసులో ఎంపీ ఆజాం ఖాన్‌తోపాటు ఆయన అనుచరుల పేర్లు కూడ చేర్చారు.అజాంఖాన్ పై ఇప్పటికే 50 కేసులు నమోదయ్యాయి.వాటిలో ముఖ్యంగా భూకబ్జాల కేసులు ఎక్కువగా ఉన్నాయి.నమోదైన భూకబ్జాల్లోని 29 కేసుల్లో ముందస్తు బెయిల్ కూడ కోర్టు నిరాకకించిన పరిస్థితి. ఇాలా ఇప్పటివరకు ఆజాంఖాన్‌పై దాదాపు 50 భూకబ్జా కేసులు,వివాదాస్పద వ్యాఖ్యలకేసులు,పుస్తకాచోరీకేసులు,వక్ఫ్ భూముల అక్రమ ఆక్రమణకేసులు నమోదుకాగా ఎన్నికలప్రచారంలో ఆయనపై పోటిచేసిన బీజేపీ అభ్యర్థి నటి జయప్రదపై కూడ అనుచితవ్యాఖ్యలు చేసినందుకు ఈసీకూడ కేసులు నమోదుచేసింది.



ఇక ఇటివల సాక్ష్యాత్తు లోక్‌సభ డిప్యూటి స్పీకర్ పై కూడ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.దీంతో ఆయనకు క్షమాపణలు చెప్పేవరకు వదలలేదు.ఇక కొద్ది రోజుల క్రితం లైబ్రరీలో పుస్తకాలుదొంగిలించాడని కేసు నమోదుకాగా,ఇప్పుడు తన ఇంట్లో చొరబడి 25000 వేల రుపాయాలతో పాటు పాలిచ్చే గేదేలను కూడా దొంగిలించాడని క్రిమినల్ కేసు నమోదైంది.ఒక ఎంపీ స్దానంలో వుండి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఆజాంఖాన్ పై తగినచర్యలు తీసుకోవాలని స్దానికులు ప్రభుత్వాన్ని,పోలీసులను కోరుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: