కొందరంతే ఎన్ని దెబ్బలు తగిలినా తమ గురించి తాము చాలా ఎక్కువగా ఊహించుకుంటుంటారు. జనసేన అధినేత పవన్ కల్యాన్ కూడా అటువంటి వారిలో ముందుంటారనే అనిపిస్తోంది. రాజధాని ప్రాంతంలో తిరుగుతున్న పవన్ మాటలు చూస్తుంటే అందిరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది.

 

శుక్రవారం రాజధాని గ్రామంలో తిరిగిన పవన్ అమరావతిని మార్చేందుకు జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయితే తాను ప్రధానమంత్రిని కలుస్తానంటూ ప్రకటించారు. నిజంగా ప్రధానమంత్రిని పవన్ కలుస్తారా లేదా అన్నది వేరే విషయం. కానీ ఓ ప్రకటనైతే రైతుల కోసం చేశారు కదా ? ఈ విషయంపైనే చర్చ మొదలైంది. రాజధాని నిర్మాణమన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని కేంద్రం ఎప్పుడో తేల్చి చెప్పేసింది.

 

పైగా చంద్రబాబునాయుడు నిర్మించాలని అనుకున్న రాజధాని ప్రాంతం ఎంతమాత్రం సురక్షితం కాదని శివరామకృష్ణన్ కమిటితో పాటు నిపుణులు కూడా చాలాసార్లే చెప్పారు. అయినా చంద్రబాబు వినలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కమిటితో పాటు నిపుణులు వద్దన్న చోటే రాజధాని నిర్మాణం ఎందుకని ఆరోజు చంద్రబాబును పవన్ అడగలేదు. రాజధాని మార్పు గురించి ఒక్కమాట కూడా మాట్లాడని జగన్ పై పవన్ విరుచుకుపడటమే విచిత్రంగా ఉంది.

 

పైగా ఇదే విషయంలో నరేంద్రమోడికి కలుస్తానంటున్నారు. మోడిని కలిస్తే ఏమవుతుంది ? వెళ్ళి జగన్ నే కలవమని చెబుతారంతే. మోడినో లేకపోతే అమిత్ షా నో చెబితే వినేరకం కాదు జగన్. తాను ఏది మంచిదని నమ్ముతారో దాన్నే నిర్భయంగా ఆచరణలోకి తెచ్చేరకం జగన్ అని ఈ మూడు నెలల్లోనే అందరికీ తెలిసిపోయింది. పోలవరం టెండర్ల రద్దు, పిపిఏల సమీక్ష లాంటి వాటిని కేంద్రం వద్దని చెప్పినా జగన్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఇక పవన్ చెప్పాడని మోడి కలగజేసుకుని రాజధానిపై జగన్ తో మాట్లాడుతారా ?


మరింత సమాచారం తెలుసుకోండి: