కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ చాలా అతిగా రియాక్ట్ అవుతుంది. ప్రపంచ దేశాలు కూడా భారత్ కే సపోర్ట్ చేయడంతో పాక్ ఒంటరి అయిపోయింది. అయితే పాక్ అసహనంలో మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని పిచ్చి కూతలు కుస్తుండటంతో ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ వైఖరిని తప్పు పట్టాయి. అయితే పరిస్థితిని గమనించిన పాక్ .. భారత్ తో చర్చలకు సిద్దమేనని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనితో భారత్ దెబ్బకు పాక్ లో వణుకు పుట్టిందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరీ రెచ్చిపోయి ప్రవర్తిస్తే పీఓకే ను భారత్ చేజిక్కిచుకున్న ఆశ్చర్యం లేదని పాక్ కు బాగా తెలుసు. ఇన్ని రోజులు కాశ్మీర్ విషయం మీద పాకిస్థాన్ .. భారత్ ను ఇబ్బంది పెట్టే విధంగా ఎన్నో వ్యాఖ్యలు చేసేది.


కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగం కాదని ఎప్పటికైనా తాము చేజిక్కించుకుంటామని పాక్ కలలు కనింది. కానీ మోడీ ప్రభుత్వం ఒక్క దెబ్బతో కాశ్మీర్ ను భారత్ లో కలిపేసుకుంది. దీనితో భారత్ తమ నెక్స్ట్ టార్గెట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఇదే విషయం పాక్ ను ఖంగారు పెట్టిస్తుంది. ఇన్ని రోజులు కాశ్మీర్ కు స్వయం ప్రతి పత్తి ఉండటంతో పాక్ చాలా ఆటలు ఆడింది. కానీ ఇప్పుడు పీఓకే ను పాక్ కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ మాత్రం తేడా జరిగిన భారత్ .. పీఓకేను భారత్ లో కలిపేసుకుంటుందని పాక్ కు బాగా తెలుసు. 


అయితే కాశ్మీర్ విషయంలో ఐరాస పట్టించుకోకపోవడంతో ... పైగా ఇది భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పడంతో పాక్ ఎక్కడ లేని అసహనానికి గురవుతోంది. అందుకే విచక్షణ కోల్పోయి రాబోయే రోజుల్లో భారత్ తో పూర్తి స్థాయి యుద్ధం తప్పదని పిచ్చి కూతలు కూస్తుంది. మా దగ్గర అను బాంబులు ఉన్నాయి అంటూ ఇమ్రాన్ ఖాన్ పిచ్చోడి మాదిరిగా మాట్లాడుతున్నారు. దీనితో పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజంలో ఏకాకిలా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: