తెలంగాణ సచివాలయంలో మునుపెన్నడూ లేని విధంగా ఉద్యోగులకు వివిధ హోదాల్లో ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. డీపీసీ ప్యానల్ ఇయర్ చివరి రోజున  శనివారం నాడు 98 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారులకు సెక్షన్ అధికారులుగా పదోన్నతులు ఇచ్చి వివిధ శాఖల్లో కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్ కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా 44 మంది సెక్షన్ అధికారులకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. రెండు రోజుల క్రితం 8 మంది ప్రభుత్వ సహాయ కార్యదర్శిలకు ప్రభుత్వ ఉప కార్యదర్శులుగా పదోన్నతి కల్పించాలని డీపీసీ ఆమోదం తెలిపింది. దీనితో గతంలో కల్పించిన పదోన్నతుల తో పాటు, ఆర్థిక శాఖలో కల్పించిన పదోన్నతులు కలిపి సుమారు 200 కు చేరుకుంది. ఇలా ఒక్క సంవత్సరంలో నే పెద్దమొత్తంలో వివిధ హోదాల్లో సచివాలయంలో పదోన్నతులు లభించడం సమైక్య రాష్ట్రంలోనూ జరగలేద‌ని కొంద‌రు పేర్కొంటున్నారు.


గత సంవత్సరం ప్రభుత్వ వివిధ శాఖల్లో పని భారాన్ని గుర్తించి వివిధ హోదాల్లో 50 పోస్టులను మంజూరు చేసింది. గత రెండు సంవత్సరాలు గా పదవి విరమణ పొందిన ఖాళీలను వివిధ న్యాయ పరమైన వివాదాల వల్ల భర్తీ చేయలేదు. దీంతో ఉద్యోగులు , ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పదోన్నతుల విషయాన్ని పరిష్కరించాలని అధికారులను కోరారు. చివరికి ప్రభుత్వ కూడా సానుకూలంగా పరిశీలించి తగు న్యాయ సలహాలను తీసుకొని పదోన్నతులతో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. శాఖల తరలింపులో అలుపెరుగకుండా పనిచేస్తున్న ఉద్యోగుల కు ఈ పదోన్నతులతో పెద్ద ఉపశమనం లభించింది. గత కొద్ది కాలంగా పదోన్నతులు ఆగిపోవడం తో కొంత మంది అర్హత ఉంది కూడా పదోన్నతి పొందకుండానే పదవి విరమణ పొందారు. పదోన్నతి పొందిన అధికారులు వివిధ శాఖల్లో రిపోర్ట్ చేస్తూతమ సంతోషాన్ని వెలిబుచ్చారు. 


సచివాలయంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సీనియారిటీ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్య ను పరిష్కరం కాకపోవడంతో APPSC ద్వారా నియమితులైన సహాయ విభాగ అధికారులు కోర్టును ఆశ్రయించారు. సీనియారిటీ పరిష్కరం అయ్యేవరకు పదోన్నతులు కల్పించ వద్దని కోరారు. మరి కొందరు సీనియారిటీ పరిష్కరం పెండింగులో ఉండాగానే పదోన్నతులు కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. అనంతరం అన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలించి వీలైనంత వరకు న్యాయపరమైన చిక్కులు లేనందున పదోన్నతులు ఇవ్వడానికి ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ క్రమంలో సచివాలయంలో ASO కేటగిరీ లోని ఉద్యోగుల్లో బిన్న వాదనలు పైకి వచ్చాయి. కానీ వివిధ దశల్లో కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల తుది తీర్పును లోబడి  పదోన్నతులు  పదోన్నతులు కల్పించడమే మేలని ప్రభుత్వం భావించిందని తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: