అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ వ్య‌వ‌హార‌శైలి ఎలా ఉంటుందో తెలిసిన సంగ‌తే. త‌నకు న‌చ్చ‌ని వాళ్ల‌తోనే..వివాదాలు పెట్టుకోవ‌డంలో ట్రంప్ దిట్ట‌. అలాంటి త‌న కుటుంబ స‌భ్యుల‌ను ఎవ‌రైనా కామెంట్ చేస్తూ...ట్రంప్ చూస్తూ ఊరుకుంటారా? స‌హించే చాన్స్ ఉండ‌దు క‌దా? స‌రిగ్గా అదే జ‌రిగింది. ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ పై వ్యాఖ్యలు చేసిన కారణంగా ట్రంప్‌ వ్యక్తిగత సహాయకురాలైన మడేలీన్‌ వెస్టర్‌హౌట్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్టు వైట్‌హౌస్‌ ప్రకటించింది. ఆమె ఇకపై వైట్‌హౌస్‌ వైపు రావడానికి వీల్లేదంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.


అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ 2016లో బధ్యతలు చేపట్టిన నాటి నుండి మ్యాడెలిన్ ట్రంప్‌ వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేస్తున్నారు.  ఆమె ఇటీవల ఓ పార్టీలో ఇతరులతో మాట్లాడుతూ, ట్రంప్ కుమార్తె టిఫానీ ఊబకాయంతో బాధపడేదని, అందుకే ఆమె ఫొటోలను చూడడానికి కూడా ట్రంప్ ఇష్టపడేవారు కాదని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను వైట్ హౌస్ తీవ్రంగా పరిగణించింది. ట్రంప్ ఆదేశాల మేర‌కు పీఏ ప‌ద‌విని ఊడ‌బీకింది. భవిష్యత్తులో మ్యాడెలిన్ వైట్ హౌస్ లో అడుగుపెట్టరాదని స్పష్టం చేసింది. అధ్యక్ష కార్యాలయానికి సంబంధించిన సమాచారం లీక్ చేసిందంటూ ఆమెపై ఆరోపణలను మోపి పంపేసింది. 


ఇదిలాఉండ‌గా, ఈ అంశం మీద ట్రంప్‌ స్పందిస్తూ కుమార్తెలంటే తనకు ఎనలేని ప్రేమని విలేకరుల సమావేశంలో తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం మీద ఆమెతో మాట్లాడానని ఆమె ఆ సమయంలో మద్యం సేవించినట్లు తనతో చెప్పారని ట్రంప్‌ అన్నారు. ట్రంప్ మ‌రో కుమార్తె ఇవాంక ట్రంప్ ప్ర‌స్తుతం వైట్‌హౌస్‌లో సేవ‌లు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. 


కాగా, 73 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్‌కు ముగ్గురు భార్యల ద్వారా ఐదుగురు సంతానం ఉన్నారు. వీరిలో మొదటి ఇద్దరు డొనాల్డ్‌ జూనియర్, ఇవాంకా ట్రంప్‌. ఇక మూడో సంతానంగా ఎరిక్‌ ఉన్నారు. వీరి తర్వాత తిఫ్ఫానీ ట్రంప్, బ్యారన్ ట్రంప్ లు కూడా ఉన్నారు. ఇక ట్రంప్‌ ఆర్గనైజేషన్‌లో తన సోదరుడు జూనియర్‌ ట్రంప్ తో కలిసి ఎరిక్ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌‌గా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: