భారత్ పాకిస్థాన్ ల మధ్య ఇపుడు అసలు పరిస్థితి బాలేదు. పాక్ రెచ్చగొట్టుడు చేష్టలతో సరిహద్దులు నిత్యం అగ్నిగుండంగా మారుతున్నాయి. పైగా పాక్ ఉన్మదిగా మారిపోయింది. ఏం మాట్లాడుతుందో తెలియకుండా పాక్ చేస్తున్న చర్యలు సభ్య దేశాలన్నీ గమనిస్తున్నాయి. ఈ దశలో భారత్ ఎంత సైలెంట్ గా ఉన్నా కూడా  వైలెంట్ ని కోరుకునే పాక్ వైఖరి చికాకు పరుస్తోంది. ఏది ఎలా ఉన్నా మనకు మనం భద్రత చూసుకోవాలి కదా.


ఇపుడు భారత్ అదే చేస్తోంది. పాక్ కవ్వింపుల నేపధ్యంలో ఎల్వోసీ వద్దకు భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చేరుకున్నారు. అక్కడ గస్తీ కాస్తున్న జవాన్లతో  ఆయన నేరుగా మాట్లాడారు, అన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకున్నారు. మరో వైపు ఆర్మీ ఉన్నతాధికారులతో కూడా బిపిన్ రావత్ సమావేశమయ్యారు. ఎల్వోసీ వద్ద విధి నిర్వహణలో ఉన్న వైట్ నైట్ కాప్స్ ని కూడా రావత్ కలుసుకున్నారు.


భద్రతా ఏర్పాట్లుతో పాటు బలగాల సన్నధ్ధత‌ను కూడా రావత్ సమీక్షించారు.  ఈ సందర్భంగా సైనికుల ధైర్య సాహసాలను ఆయన కొనియాడారు. నిజానికి కాశ్మీర్ కి సంబంధించి ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తలు బాగా పెరుగుతున్నాయి. పాక్ ఈ మధ్యనే క్షిపణి ప్రయోగం చేసింది.


మరో వైపు పాకిస్తాన్ మంత్రులు యుధ్ధం తప్పదని హెచ్చరిస్తున్నారు, ఈసారి జరిగే యుధ్ధం చివరిది తాడో పేడో తేల్చేసిది అవుతుందని కూడా అంటున్నారు. భారత్ విషయంలో తాము అమీ తుమీకి సిధ్ధంగా ఉన్నామని అంటున్నారు. అణు బాంబులు వేస్తామని బెదిరిస్తున్నారు. ఈ దశలో భారత్ కూడా తనదైన జాగ్రత్తలో ఉందనడానికి రావత్ పర్యటన ఓ నిదర్శనంగా చెబుతున్నారు. రేపు ఏది జరిగినా తిప్పికొట్టేందుకు సైనికులను సిధ్ధం చేస్తున్నట్లుగా పరిస్థితి చూస్తుంటే కనిపిస్తోంది. మరి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: