పరిచయం చదవడానికి ఈజీగా అనిపిస్తుంది.కాని దీనివల్ల ఎన్నిలాభాలున్నాయో అన్ని నష్టాలున్నాయి.ఏ రూపకంగా నైనా జరిగే పరిచయాన్ని,సరైన విధానంలో కొనసాగిస్తే ఆరోగ్యకరం.ఇక సెల్‌ఫోన్ లో వచ్చిన రకరకాలైన యాప్‌లతో ప్రపంచంలో ఎక్కడివారైతోనైనా పరిచయం పెంచుకోవచ్చూ.అలా పెంచుకున్న పరిచయమే ప్రాణాలు తీసుకునే వరకు వచ్చింది.ఈ సంఘటన జరిగింది హైదరాబాద్‌లో..ఇక టిక్‌టాక్‌ అనే ఈ యాప్ తెలియని వారుండరు.బుడ్డోడి నుండి గుడ్డోడివరకు.పడుచు వారినుండి ముసలి వారివరకు దాదాపు రోజు దీనితోనే కాలం గడుపుతున్నారు.ఈ టిక్‌టాక్‌ వల్ల ఉద్యోగాలు కూడా పోయి ఇంట్లో కూర్చున్న వారెందరో,అందరికి ఇప్పుడు ఇదొక వ్యసనంలా మారింది..ఇక ఇక్కడ టిక్‌టా తో అయిన పరిచయం ఎంతటి పరిణామానికి  దారితీసిందంటే ప్రాణాలు పోయేలా చేసింది.




ఎర్రగడ్డలోని నేతాజీ నగర్‌కు చెందిన సాయి (24) జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.కొంతకాలం కిందట అతడికి టిక్‌టాక్ ద్వారా కర్నూలుకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది.అనతి కాలంలోనే ఆ పరిచయం స్నేహంగా,ఆపై ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో సాయి పలుమార్లు తన అవసరాల కోసం టిక్‌టాక్ మిత్రురాలి నుంచి డబ్బులు అడిగి తీసుకున్నాడు.ఓసారి అధిక మొత్తం అవసరం పడటంతో ఆమె కాదనలేక తన నగలను ఇచ్చేసింది.యువతి నగలను సాయి తన వ్యక్తిగత అవసరాల కోసం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు.కొంతకాలం తర్వాత సదరు యువతి నగలు తిరిగి ఇవ్వమని సాయిని కోరింది.కానీ,అప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న సాయి..




ఆ నగలను సమయానికి తిరిగి ఇవ్వలేకపోయాడు.దీంతో ఆందోళనకు గురైన యువతి తన తల్లిదండ్రులకు విషయం చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు.యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.విచారణలో భాగంగా సాయికి ఫోన్ చేయగా ఆందోళనకు గురైన సాయి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఇంకా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.చూసారుగా టిక్‌టాక్‌ ఎంత పనిచేసిందో.అందుకే పరిమితి దాటిన పరిచయం ప్రాణాలు తీస్తుందని చెబితే వినాలంటారు పెద్దలు....


మరింత సమాచారం తెలుసుకోండి: