ఈ మధ్య కాలంలో మాంసాహారులు నుంచి చాలా మంది శాఖాహారులుగా మారుతున్నారు.  మారుతున్న కాలానికి అనుగుణంగా శాఖాహారులుగా ఉన్న కొందరు మాంసాహారులుగా మారుతున్నారు.  మార్పులు అన్నది సహజమే.  మనకు బాగా కావాల్సిన వ్యక్తులు పోయినపుడు వాళ్లకు ఇష్టమైనవి సంవత్సరంలో ఒకరోజు వండి వాళ్లకు పెడుతుంటాం.  


అలా పెట్టినపుడు వాళ్ళు సంతోషంగా వాటిని స్వీకరిస్తారని అంటారు.  సంతృప్తిగా దీవిస్తారని అంటుంటారు.  అయితే, కొంతమందికి కొన్ని ఇష్టాలను వదులుకోలేక మరణించాక కూడా దెయ్యాల్లా తిరుగుతూ వారి కోరికలు తీర్చుకుంటూ ఉంటారని అంటుంటారు.  ఇందులో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియదుగాని, గోవాలో మాత్రం ఈ విధమైన ప్రచారం మాత్రం బాగా జరుగుతున్నది.  దీనికి నిదర్శనాలు కూడా ఉన్నాయని అంటున్నారు.  


ముంబై.. గోవా ఎన్.హెచ్ 17 హైవేలో ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం కాదు.  అంటే యాక్సిడెంట్ లు అవుతుంటాయి అని కాదు.. ఆ రూట్ లో వెళ్లే సమయంలో అది సాయంత్రం సమయంలో ఎవరూ కూడా ఆ మార్గంలో చికెన్ తో వెళ్ళకూడదు.  ఒకవేళ బండికానీ, లేదంటే ఏ వ్యక్తిగాని చికెన్ తీసుకొని ఆ మార్గంలో ప్రయాణిస్తుంటే.. తెలియకుండానే వాహనం కంట్రోల్ తప్పుతుంది.  యాక్సిడెంట్ కు గురవుతుంది.  



ఎందుకు అలా జరుగుతుంది అనే విషయం ఇప్పటి వరకు ఎవరూ కనుక్కోలేదు.  కనుక్కోవాలని ప్రయత్నం చేసి విఫలం అయ్యారు.  చివరకు తేలింది ఏంటి అంటే.. ఆ దారిలో చికెన్ దెయ్యాలు ఉన్నాయని, చికెన్, మటన్ వంటి పదార్ధాలు వండుకొని తీసుకెళ్లే సమయంలో అలా తెలియకుండా యాక్సిడెంట్ లు జరుగుతుంటాయని అంటున్నారు.  మిగతా వాహనాలకు ఎలాంటి ప్రమాదాలు జరగవు.  కేవలం నాన్ వెజ్ తీసుకెళ్లే వాహనాలు మాత్రమే అలా జరుగుతున్నది.  కావాలంటే ఆ దారిలో మీరు నాన్ వెజ్ తీసుకొని వెళ్ళండి తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: