మన ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే.. ఏదైనా ఒక మంచి పని చేయాలి అనుకోని మొదలు పెడితే.. దానికి అడ్డుపుల్ల వేసేవాళ్ళు కొందరు ఉంటారు.. కొంతమంది సొంత ప్రభుత్వంలోనే వచ్చిన డబ్బులు నొక్కేసి ఇంకా కావాలని చెప్పి అయ్యే ఖర్చుకు రెండింతలు మూడింతలు చేసేవాళ్ళు ఉంటారు.  అప్పటికి ప్రభుత్వం మారిపోతుంది.  కొత్త ప్రభుత్వం వస్తుంది.  అదే చోట మరో శిలాఫలకం.. సేమ్ సీన్ రిపీట్..మనీ సినిమాలో పెళ్లి చేసుకోవాలని వచ్చిన ఉత్తేజ్ కు కోట చెప్పినట్టు సేమ్ సీన్ రిపీట్ అవుతూనే ఉంటాయి. 


అలాంటి ప్రభుత్వాలు మనవి.  ఎప్పుడో దశాబ్దాల క్రితం కట్టిన కట్టడాలను గురించి మాట్లాడతారు తప్పించి కొత్తగా ఎన్ని కట్టాం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నది అనే విషయం గురించి మాత్రం మాట్లాటం.  ఎందుకంటే ఒకవేళ కొత్తగా కట్టి ఉంటె.. అవి ఎంత గట్టిగ ఉంటాయో జార్ఖండ్ లోని ఇరిగేషన్ కెనాల్ ను చూస్తేనే అర్ధం అవుతుంది.  ఈ కెనాల్ పూర్తికావడానికి 42 సంవత్సరాలు పట్టింది.  బీహార్ తో కలిసి ఉన్న సమయంలో ఈ కెనాల్ కు ప్రారంభోత్సవం జరిగింది.  


బీహార్ నుంచి ఝార్ఖం విడిపోయి 19 సంవత్సరాలైంది.  ఝార్ఖండ్లోని పంటల కోసం ఏర్పాటు చేసిన ఈ కెనాల్ ఎలాగోలా కష్టపడి పూర్తి చేశారు.  42 సంవత్సరాల శ్రమించి కెనాల్ ను పూర్తి చేశారు అంటే అది ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి.  కానీ, ఇక్కడ ఏం జరిగింది.  ఏడేళ్లు కష్టపడి తీసిన అంజి సినిమాలాగా ఉసూరుమనిపించింది.  నాణ్యత ఎంత దారుణంగా ఉన్నదో ఇటీవలే వచ్చిన వరదల ద్వారా తేలిపోయింది.  పైన భారీగా వర్షాలు కురవడంతో.. బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు కూడా వరద ముప్పు ఏర్పడింది. 


దీంతో ఈ ఇరిగేషన్ కెనాల్ కు పూర్తి స్థాయిలో వరద చేరింది.  ఇంకేముంది.. వరద తాకిడితో ఇరిగేషన్ కాలువకు గండి పడింది.  ఇలా గండి పడటానికి చెప్తున్న కారణం వింతగా ఉన్నది.  ఇరిగేషన్ కాలువను ఎలుకల కారణంగా రంద్రాలు పడ్డాయని.. దీంతో వరద వచ్చిన సమయంలో ఆ వరద ఉధృతికి గండి పడిందని అంటున్నారు.  ఈ గండి ఏర్పడటంతో గిరిదిహ్, హజారీబాగ్, బొకారో జిల్లాలోని చాలా గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి.  వందలాది ఎకరాలు నీట మునిగాయి.  42 సంవత్సరాలు కష్టపడి కట్టిన కెనాల్ కేవలం ఒక్క 24 గంటల్లో కోతకు గురికావడం గండిపడి వరద నీటికి కొట్టుకుపోవడం ఏంటో మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: