2014లో మెజారిటీ ఉన్న రాజ్యసభలో పెద్దగా సంఖ్యాబలం లేదు.  ఎందుకో తెలిసిందే.  రాజ్యసభ పదవీకాలం ఆరేళ్ళు.  దీంతో అక్కడ పూర్తిస్థాయిలో బలం కావాలి అంటే సమయం తీసుకుంటుంది.  అయితే, 2019 తరువాత బీజేపీకి కావాల్సిన సంఖ్యాబలం వచ్చింది. ఇటు లోక్ సభలోను, అటు రాజ్యసభలోను సంఖ్యాబలం పుంజుకుంది.  అప్పటి నుంచి సంచల నిర్ణయాలు తీసుకున్నారు.  


తలాక్ బిల్లును, ఆ తరువాత ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం వంటివి బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు అని చెప్పాలి.  ఈ నిర్ణయాలు తీసుకున్న తరువాత బీజేపీ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నట్టు దీన్ని బట్టి అర్ధం అవుతున్నది.  ఆ తరువాత బీజేపీ కొత్త వాహన చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది.  ఈరోజు నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది.  


ఈ చట్టం అమలులోకి తీసుకురావడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి.  అందులో ఒకటి పబ్లిక్ ట్రాస్పోర్ట్ ను పెంచడం.. వాహన కాలుష్యాన్ని తగ్గించడం వంటివి ముఖ్యమైనవి.  ఇదిలా ఉంటె, బీజేపీ ఎన్నికల సమయంలో కర్తాన్ పూర్ కారిడార్ ను నిర్మిస్తామని చెప్పారు.  కర్తాన్ పూర్ లో గురుసాహెబ్ పుట్టిన ప్రాంతం. అది సిక్కులకు పరమపవిత్రమైన ప్రాంతం.  ఈ ప్రతి ఏడాది గురుసాహెబ్ పుట్టినరోజు సందర్భంగా పంజాబ్ నుంచి లక్షలాది మంది పాక్ లో ఉన్న గురుసాహెబ్ పుట్టిన ప్రాంతాన్ని దర్శనం చేసుకుంటారు.  


ఆ ప్రాంతం పాకిస్తాన్ లో ఉండటం వలన అక్కడికి వెళ్ళాలి అంటే చాలా ఖర్చు అవుతుంది.  వీసాలు రావడం కష్టంగా ఉంటుంది.  జీవితంలో ఒక్కసారైనా పంజాబీలు ఆ ప్రాంతాన్ని దర్శనం చేసుకోవాలని అనుకుంటారు.  దానికోసం ప్రయత్నం చేస్తుంటారు.  కర్తాన్ పూర్ కారిడార్ నిర్మాణం పూర్తయితే.. పంజాబ్ నుంచి గురుసాహెబ్ పుట్టిన ప్రాంతానికి ఈజీగా వెళ్లొచ్చు.. ఎలాంటి ఖర్చు లేకుండా వెళ్లి రావొచ్చు.  
బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కర్తాన్ పూర్ కారిడార్ నిర్మాణం గురించి కూడా ఉన్నది. 


ఆర్టికల్ 370 రద్దు తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.  దీంతో కర్తాన్ పూర్ కారిడార్ నిర్మాణం పూర్తికాదేమో అనుకుంటున్నారు.  దీనిపై అమిత్ షా వివరణ ఇచ్చారు.  హామీ ఇచ్చినట్టుగా కర్తాన్ పూర్ కారిడార్ ను నిర్మించి తీరుతామని ఆయన తెలిపారు.  బీజేపీ మాట ఇచ్చింది అంటే దాన్ని అమలు చేసి తీరుతుంది అని ఇప్పటికే స్పష్టం అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: