తెలుగుదేశం పార్టీ కి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ  పార్టీ తరఫున ఇటీవల లోక్ సభ  ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆడారి  ఆనంద్ వైఎస్సార్సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆనంద్ తన సతీమణి మాజీ మున్సిపల్ చైర్మన్ రమ తోపాటు అనునుచరులతో కలిసి ,   వైస్సార్ సిపి  అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.  పార్టీ లో చేరిన వారిని జగన్ సాదరంగా ఆహ్వానించి పార్టీ  కండువా కప్పారు  . 

 విశాఖ డెయిరీ  చైర్మన్  ఆడారి తులసీరావు కుమారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆనంద్,  అనతికాలంలోనే తెలుగుదేశం పార్టీలో మంచి గుర్తింపు సాధించుకున్నారు.  ఇటీవల జరిగిన లోక్ సబ్  ఎన్నికల్లో ఆయనకు పార్టీ నాయకత్వం  అనకాపల్లి స్థానం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది . అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి   వీచిన ఎదురు గాలి లో భాగంగా ఆనంద్ కూడా  ఓటమి పాలయ్యారు. లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలుకావడం తో ,  అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆనంద్ ఇటీవల వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 

ఆనంద్ ఒక్కరే కాకుండా యలమంచిలి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రమతో పాటు  మరో 12 మంది విశాఖ డెయిరీ  డైరెక్టర్లు సైతం వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు. దీంతో దాదాపు మూడు దశాబ్దాలుగా టిడిపి నేతలు అధీనంలో ఉన్న విశాఖ డైరీ ఇప్పుడు వై ఎస్ ఆర్ సి పి కైవసం అయినట్లు అయింది. విశాఖ డెయిరీని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ హయాంలోను తీవ్ర ప్రయత్నాలే జరిగాయి . కానీ తెలుగుదేశం పార్టీ కి గట్టి పట్టు ఉండడం తో ఏమి చేయలేకపోయారు ఆనాటి కాంగ్రెస్ నేతలు . 


మరింత సమాచారం తెలుసుకోండి: