ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా.. పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది.  కాశ్మీర్ ఇండియా అంతర్గత విషయం అని.. దాని విషయంలో మరొకరు కలుగజేసుకోవడానికి సహించబోమని ఇప్పటికే ఇండియా వందసార్లు చెప్పింది.  కానీ, పాకిస్తాన్ మాత్రం తన వాలకం మార్చుకోలేదు.  మార్చుకోకపోగా.. ఇండియాపై అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టాలని చూసింది.  


కాశ్మీర్ కు సపోర్ట్ చేస్తామని, అవసరమైతే ఇండియాపై యుద్ధంపై చేయడానికి కూడా రెడీ అంటున్నది పాకిస్తాన్.  ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని అమెరికా ఇప్పటికే పాకిస్తాన్ ను హెచ్చరించింది.  కానీ, పాక్ మాత్రం ఈ విషయం గురించి పట్టించుకోవడం లేదు.  ఇదిలా ఉంటె, నిన్న పాకిస్తాన్ కు చెందిన ఓ వ్యక్తిని న్యూయార్క్ లో పోలీసులు అరెస్ట్ చేశారు.  


ఎఫ్ బిఐ అధికారులు పాక్ యువకుడిని తనదైన స్టైల్ లో ఇంటరాగేట్ చేసింది.  వీరి విచారణలో ఊహించని విషయాలు బయటకు వచ్చాయి.  అవేమంటే.. అమెరికాలో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు పధక రచన చేసినట్టు విచారణలో తేలింది. దానికోసమే ఆ యువకుడు న్యూయార్క్ లో రెక్కీ నిర్వహించాడు.  అయితే, విషయం తెలుసుకున్న అండర్ కవర్ అధికారులు యువకుడిని పట్టుకున్నారు.  


ప్రతి సంవత్సరం అమెరికా ఉగ్రవాద నిరోధక కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు పాకిస్తాన్ కు ఇస్తున్నది.  ఉగ్రవాదులను ఆగడాలను అరికట్టకపోగా, వారిని పెంచి పోషిస్తోంది.  ఆఫ్గనిస్తాన్, ఇండియాల్లోకి ఉగ్రవాదులను అక్రమంగా చొరబడేటట్టు చేస్తున్నది పాక్.  దీనికి అక్కడి సైన్యం కూడా సహకరిస్తుండటం విశేషం.  ప్రభుత్వం ఉగ్రవాదులకు కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నది.  గతంలో పాకిస్తాన్ 40వేల మంది ఉగ్రవాదులు పాక్ లో ఉన్నారని ఆ దెస ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి. నయా పాకిస్తాన్ ను నిర్మిస్తామని చెప్పిన ఇమ్రాన్, ఉన్న పాకిస్తాన్ పరువును అంతర్జాతీయంగా పోగొడుతున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: