తెలంగాణ‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా త‌మిళ‌నాడుకు చెందిన డాక్ట‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ నియ‌మితుల‌య్యారు. తెలంగాణ‌కు గ‌వ‌ర్న‌ర్‌గా ఆమేను నియ‌మిస్తూ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. తెలంగాణ‌కు గ‌వ‌ర్న‌ర్‌గా సుధీర్ఘ సేవ‌లు అందించిన ఈఎస్ఎల్ న‌ర‌సింహాన్‌ను బ‌దిలీ చేశారు. తెలంగాణ‌కు కొత్త గ‌వ‌ర్న‌ర్‌ను నియ‌మిస్తూనే తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియ‌ర్ నేత బండారు ద‌త్తాత్రేయ‌ను హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించారు. దేశంలో తెలంగాణ‌తో స‌హా ఐదు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌ల‌ను నియ‌మిస్తూ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఉత్వ‌ర్వులు జారీ చేయ‌డం విశేషం.  


తెలంగాణకు గ‌వ‌ర్న‌ర్‌గా తమిళిసై సౌందర్‌రాజన్ ను, హిమాచల్‌ ప్రదేశ్‌కు బండారు దత్తాత్రేయ ను, రాజస్తాన్ కు  కల్‌రాజ్‌ మిశ్రాను, మహారాష్ట్రకు భగత్‌సింగ్‌ కోశ్యారీను, కేరళకు  మహ్మద్‌ ఖాన్‌ను నియ‌మించారు. రాజ‌కీయ కుటుంబ నేప‌థ్యం క‌లిగిన కుటుంబంలో ఆమే 1961 జూన్ 2న క‌న్యాకుమారి జిల్లా నాగ‌ర్ కోయిల్ లో జ‌న్మించారు. ఆమె తండ్రి అనంత‌న్ పార్ల‌మెంటేరియ‌న్‌. వాస్త‌వానికి తండ్రి కాంగ్రెస్‌వాది. ఆమె చెన్నైలోని మ‌ద్రాస్ మెడిక‌ల్ క‌ళాశాల‌లో ఎంబీబీఎస్‌, ఎంజీఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో గైనకాలజీ విభాగంలో పీజీ పూర్తి చేశారు.


ఆ తర్వాత కెనడాలోని సోనోలజీ.. ఎఫ్ ఈటీలో థెరపీలో ప్రత్యేక శిక్షణ పొందారు అభ్య‌సించి, చెన్నైలోని రామ‌చంద్ర మెడిక‌ల్ క‌ళాశాల‌లో ఐదేళ్ళు అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేశారు. ఆమె భ‌ర్త సౌంద‌ర‌రాజ‌న్ కూడా వైధ్యుడే కావ‌డం విశేషం. సవితా వర్సిటీలో నెఫ్రాలజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్ గా వ్యవహరిస్తున్నారు. అపోలో ఆసుపత్రిలో నెప్రాలజిస్ట్ సీనియర్ కన్స్ ల్టెంట్ గా పని చేస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు.


రాజ‌కీయ కుటుంబ నుంచి రావ‌డంతో స‌హాజంగానే  చిన్న‌ప్ప‌టి నుంచే రాజ‌కీయాల్లో ఆస‌క్తి క‌నబ‌రించింది. చ‌దువుతున్న‌ప్పుడే విద్యార్థి సంఘానికి  లీడ‌ర్ అయింది. తండ్రి కాంగ్రెస్ వాది అయినా బీజేపీ సిద్ధాంతాల ప‌ట్ల ఆక‌ర్షితురాలై బీజేపీలో 1996లో బీజేపీలో చేరి  అనేక హోదాల్లో పార్టీకి సేవలు అందించారు. 1999లో సౌత్ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా.. 2001లో రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా.. 2005లో ఆల్ ఇండియా కో- కన్వీనర్ గా.. 2007లొ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా .. 2010లొ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా,  2013లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమె.. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. 


ఇలాంటి వేళ ఆమె తెలంగాణ  గవర్నర్ గా ఎంపికై సంచలనంగా మారారు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా ఖ్యాతిని తన సొంతం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉన్న తమిళిసై సౌందర్‌రాజన్ మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడే స్టూడెంట్స్ లీడర్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ కుటుంబం నుంచే వచ్చినప్పటికీ బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆమె ఆకర్షితురాలయ్యారు. బీజేపీకి పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించారు.  తమిళనాడు రాష్ట్ర బీజేపీ విభాగంలో వివిధ స్థాయిల్లో సేవలందించారు. 2010లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, ఆ తర్వాత 2013లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. 


2014 ఆగస్టు 16న తమిళనాడు రాష్ట్ర విభాగం అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈమె ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌లో ఏనాడు గెలిచిన దాఖాలాలు లేవు.  గతంలో రెండుసార్లు  అసెంబ్లీ ఎన్నికలు, రెండుసార్లు  పార్లమెంటు ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటికీ గెలవలేదు. కొస‌మెరుపుః ఇప్పుడు జూన్ 2కు ఓ ప్ర‌త్యేక‌త ఏర్పడింది. ఎందుకంటే  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2. కొత్త‌గా తెలంగాణ గ‌వ‌ర్నర్‌గా నియ‌మితులైన త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ పుట్టింది జూన్‌ 2నే కావ‌డం విశేషం. ఇది యాదృశ్చిక‌మే అయిన‌ప్పటికి తెలంగాణ‌లో ఒకేరోజున తెలంగాణ  వ్యాప్తంగా ఆవిర్భావ‌ వేడుక‌లు, రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రుగనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: