మెగా ఫైర్ బ్యాండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు రేపు.. యువతలో మంచి క్రేజ్ ఉన్న స్టార్ ఎవరంటే అది పవన్ కళ్యాణ్ అని తొంబై శాతం అంటారు. సినిమాకు దూరంగా ఉన్న పవన్, జనాలకు ఎప్పుడు దగ్గరగా ఉంటారు. జనసేన పార్టీని స్థాపించిన ఈయన, ఈ సారి ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. ఎన్నికల పేరుతో నాగ బాబు పవన్ గూటికి చేరాడు. అయన కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని చవి చూసాడు. 

ఏది ఏమైనా కూడా పవన్ జనాల మనసును బాగా అర్థం చేసుకున్న వ్యక్తిగా, వారి సమస్యలపై పోరాడటానికి ముందుంటాడు. ఓటమి నా రేపటి తొలి అడుగు అని నమ్ముకున్న పవన్, పాద యాత్రలతో మరింత చేరువయ్యే పనిలో ఉన్నారు. తన మ్యానరిజం తో.. తన యాట్టిట్యూడ్ తో ఎందరో అభిమానులను పోగేసుకున్న పవన్ రేపు పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనున్నారు. 

ఆయన  పుట్టిన రోజున సందర్బంగా జై సేన సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. 'జై సేన, జై సేన..' అంటూ సాగే ఈ గీతాన్ని పవన్‌ సోదరుడు, టీమేగా బ్రదర్ నాగబాబు విడుదల చేశారు. ఈ సినిమాకు వి సముద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, సీనియర్ నటులైనటువంటి శ్రీకాంత్, పృద్వి, శ్రీ మొదలగు వారు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ చిత్ర దర్శకుడు గతంలో చాలా బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా అయన మీడియా ప్రముఖులతో సమావేశం అయినప్పుడు ఈ జై సేన సినిమా గురించి మాట్లాడుతూ.. నేను తీసే ప్రతి సినిమాలో ఉన్నటువంటి  అభ్యుదయ భావాలు ఈ సినిమాలో కూడా ఉన్నాయి. అందరు నటులు చక్కగా ఇందులో నటిస్తున్నారు. పవన్ అభిమానులు చేసే మంచి పనులను ఈ సినిమాలో చూపిస్తారని అయన వెల్లడించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: