రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతూనే వున్నారు.ఆడది కనిపిస్తే చాలు,ఎక్కడైన ఎగబడుతున్నారు.ఓ క్షణం ఒంటరిగా దొరికితే తమలోని పశువు ప్రవృత్తిని బయటకు తీస్తు న్నారు.అందుకోసం సరైన ఆవకాశం వచ్చేదాక ఎదురుచూస్తున్నారు.అమెరికాలో గన్ కల్చర్ వస్తే ఇండియాలో రేప్ కల్చర్ వచ్చినట్లు వుంది.ఇప్పుడు జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తుంటే.ఇక ముందు ముందుతరాల పరిస్ధితి ఏంటో?కాని ఇక్కడొకఅమ్మాయి చేసినట్లుగాచేస్తే అత్యాచారం నుండి కొంతలోకొంతైన బయటపడి తప్పించుకోవచ్చు.ఒంటరిగావున్నానని భయపడలేదు,అదును చూసి వచ్చినఅవకాశాన్ని వాడుకుంది.తనశీలాన్ని తానే కాపాడు కుంది.తనపై అత్యాచారయత్నానికి పాల్పడిన కామాం ధుడి బారి నుంచి చాకచక్యంగా తప్పించుకుంది ఇంతకు ఈ బాలిక వయస్సు 14ఏళ్లు.



ఛండీఘడ్‌లోని జీరక్‌పూర్‌లో గల మోతియా రాయల్ సిటీ సొసైటీలోని ఓ ఫ్లాట్‌లో 14ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.శుక్రవారం తన ఫ్లాట్ నుంచి చిన్న పనిపడి కిందికి వెళ్లేందుకు లిఫ్ట్‌ కోసం వేచిచూస్తున్న సమయంలో బాలికపై నవీన్ అనే యువకుడు కన్నేశాడు.లిఫ్ట్ ఓపెన్ కాగానే బాలికతో పాటు అతడూ నంగనాచిలా లోనికి వెళ్లాడు. అందులో ఎవరూ లేకపోవడంతో బాలికపై అత్యాచారానికి యత్నించాడు.ఆమె ఒంటిమీది దుస్తులు సగం వరకు చింపేశాడు.లిఫ్ట్‌ను తాను నివసించే ఫ్లోర్‌లో ఆపేసి ఆమెను తన గదికి లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు.



ఆ సమయంలో చురుగ్గా స్పందించన బాలిక ప్రతిఘటిస్తూ తన చెప్పులతో అతడిని తీవ్రంగా కొట్టి వెనక్కి నెట్టి  అర్ధనగ్నంగానే తన ఫ్లాట్‌కు వెళ్లి జరిగిన విషయం తల్లి దండ్రులకు చెప్పింది.నవీన్ 15రోజులుగా తన వెంట పడుతున్నాడని,ఇప్పుడేమో లిఫ్ట్‌లో రేప్ చేసేందుకు ప్రయత్నించాడని చెప్పడంతో వారు వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు నవీన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.పిల్లలు ఎంత జాగ్రత్తగా వున్న ఇలాంటి సంఘటనల నుండి తప్పించుకోలేక పోతున్నారు.అందుకే వీలైనంత వరకు ఒంటరిగా బయటకు వెళ్ళక పోవడమె మంచిది.అలా వెళ్లవలసి వస్తే పెప్పర్ స్ప్రే కాని కారం పాకెట్ కాని వెంటవుంచుకుని వెళ్లాలని తెలుపుతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: