మోటార్​ వాహనాల నూతన చట్టం-2019 అమలులోకి వచ్చిన తొలి రోజు ట్రాఫిక్​ పోలీసులు నిబంధనలు అతిక్రమించిన వారి బెండు తీశారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీ స్థాయిలో ఛలాన్లు విధించారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వివిధ నిబంధనల కింద ఒక్క రోజులోనే 3,900 ఛలాన్లు జారీ అయ్యాయి. 


డ్రైవింగ్​ లైసెన్స్​ సహా, ట్రాఫిక్​ నిబంధనలను కఠినతరం చేస్తూ.. మోటార్​ వాహనాల చట్టంలో సవరణలు చేసింది కేంద్రం. జులైలో పార్లమెంటు ఆమోదం పొందిన ఈ నూతన చట్టం సెప్టెంబర్​ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఏపీ, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో కొత్త ఫైన్లు ఇంకా అమలులోకి రాలేదు. ఒకేసారి ఈ రేంజ్‌లో ఫైన్లు వేస్తే సామాన్య జనం ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో..కాస్త నెమ్మదిగా నూతన చట్టాన్ని అమలు చేయనున్నారు.


ఈ చట్టం ప్రకారం హెల్మెట్​, సీట్​ బెల్ట్​ ధరించకపోతే.. రూ.1,000 జరిమానా ఇంతకు ముందు ఇది రూ.100గా ఉంది.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే.. రూ.5,000 జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపితే: ప్రస్తుత జరిమానా రూ.500
పెంచిన జరిమానా రూ.1000
ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడిపితే: ప్రస్తుత జరిమానా రూ.1000
పెంచిన జరిమానా రూ.2000
పరిమితికి మించి లగేజ్ ఉంటే: ప్రస్తుత జరిమానా రూ.1000
పెంచిన జరిమానా రూ.2000
రిజిస్ట్రేషన్ లేని వాహనాన్ని నడిపితే: ప్రస్తుత జరిమానా రూ.5000
పెంచిన జరిమానా రూ.10,000
ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలను నడిపితే: ప్రస్తుత జరిమానా రూ.2000
పెంచిన జరిమానా రూ.5,000
ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి స్పీడుగా వాహనాన్ని నడిపితే జరిమానా రూ.1,000
నో పార్కింగ్ వద్ద వాహనాన్ని నిలిపితే జరిమానా రూ.1000
డ్రంక్ డ్రైవ్ చేస్తే రూ 10,000 జరిమానా మరియు జైలు శిక్ష.

ఇక డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ రేపటి నుంచి జాగ్రత్తగా ఉండడం అవసరం


మరింత సమాచారం తెలుసుకోండి: