జనసేన పార్టీని 2019 లో దెబ్బ తీసింది ఏదైనా ఉందంటే అందులో ఒకటి టీడీపీతో స్నేహం. తెర వెనుక నిజంగా టీడీపీతో పవన్ కలిసిపోయాడా లేదా అని పక్కన పెడితే ఎన్నికలప్పుడు జనాలు కూడా బలంగా నమ్మారు. దానికి అవకాశం ఇచ్చింది కూడా పవనే. ఎన్నికలప్పుడు కేవలం జగన్ ను మాత్రమే టార్గెట్ చేయడంతో ప్రజల్లో చులకన అయిపోయారు. ఐదేళ్లు పరిపాలించిన చంద్రబాబును వదిలేసి .. జగన్ మీద విమర్శలు ఏంటని చివరికి జనసైనికులకు కూడా అసహనం వచ్చింది. అయితే ఇప్పడూ మళ్ళీ టీడీపీ పార్టీ పవన్ తో దగ్గరయ్యేందుకు తెగ ఆరాటపడుతుంది. ఎప్పుడు లేనిది కొన్ని మీడియా ఛానెల్స్ పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఎక్కడ లేని హడావిడి చేస్తున్నాయి.


షార్ట్ వీడియోస్ రూపంలో పిచ్చ పబ్లిసిటీ ఇస్తున్నాయి. చివరికి పచ్చ మీడియా కూడా పవన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టునట్టుంది. ఇవన్నీ చూస్తుంటే .. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగినట్టుంది. ఎన్నికలో టీడీపీ ఘోర ఓటమిని చవి చూసిన తరువాత .. మళ్ళీ జనసేనతో మిత్ర బంధం పెట్టుకోవాలని .. వచ్చే ఎన్నికల నాటికీ కలిసి జగన్ మీద పోరాడాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అందుకే పచ్చ మీడియా గాని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పవన్ పుట్టిన రోజు సందర్భంగా నానా హంగామా చేస్తున్నారు. 


అయితే మళ్ళీ టీడీపీ మాయలో పవన్ పడితే ఇక అంతే సంగతులు. పవన్ కు ఉన్న కాస్తో కూస్తో పొలిటికల్ మైలేజి కూడా గంగలో కలిసి పోతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీతో నాలుగేళ్లు కలిసి ఉన్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు గాని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ఒక ఏడాది ముందు టీడీపీ మీద విమర్శలు చేసి బయటకు వచ్చేశారు. ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేసింది. అయితే ఎన్నికలో ఇటు జనసేన, టీపీడీ పార్టీలు రెండు ఘోరంగా ఓడిపోయాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: