నిన్న అమరావతి లోని తుళ్లూరు మండలం, అనంతవరంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి జరిగిన అవమానం రాజకీయంగా కాక రేపుతోంది. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఘటనను ఖండిస్తున్నారు. వైసిపి తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పండుగ సందర్భంగా వినాయకుని మండపం దగ్గరకు వెళ్లడంతో టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకే ఎమ్మెల్యే అక్కడకు వెళ్లారు. ఆహ్వానించి తనను కులం పేరుతో దూషించారని శ్రీ దేవి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ కార్యకర్త బుజ్జి ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.


ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కింద కొమ్మినేని శివయ్య, సాయి, రామక్రిష్ణ,బుజ్జీల పై కేసు నమోదయ్యింది. తాడికొండ ఎమ్మెల్యే ను గణేషుని మండపంలో కులం పేరుతో అవమానించడం దారుణమన్నారు ప్రోగ్రసివ్ ఫ్రంట్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు. పౌరుల మత స్వేచ్ఛను హరించే విధంగా ఒక ఎమ్మెల్యేని అడ్డుకోవడం సరి కాదని ఆయన అన్నారు . ఈ ఘటనలో దోషులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలంటున్నారు లక్ష్మణరావు. తుళ్లూరు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ని వినాయక చవితి పందిళ్ల లోనికి రాకుండా అడ్డుకోవడమే కాకుండా కులం పేరుతో దూషించారంటూ తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీని పై వివిధ ప్రజా సంఘాల మరియు నేతల నుంచి కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.  



  ఈ ఘటన చాలా దారుణమైందని, సాటి పౌరుడి గా లక్ష్మణరావు ఖండించారు. వినాయక చవితి సందర్భంగా తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అనంతవరం గ్రామంలో వినాయక చవితి పందిళ్లకు వెళుతున్న సందర్భంగా కొంత మంది కులం పేరుతో అడ్డగించారు. ఇది రాజ్యాంగ సూత్రాలకే పూర్తి విరుద్ధం గా ఉందని లక్ష్మణరావు ఖండించారు. వాళ్ళు ఏ పందిరి వేసినప్పటికి కూడా ఒక ఎమ్మెల్యే అని కాకుండా ఒక పౌరురాలిగా కూడా ఆవిడకి వెళ్ళేటటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది.



రాజ్యాంగంలో మత స్వేచ్ఛ హక్కు ఒక పౌరుడు ఎక్కడికైనా సరే వెళ్లి ఆరాధించే అవకాశాన్ని కల్పించింది. అందువల్ల స్వయంగా ఒక ఎమ్మెల్యేని కులం పేరుతో మరి దేవుడు పందిరిలోకి రాకుండా అడ్డుకోవడం అనేది సరైనటువంటి విషయం కాదని ఆయన తెలియజేశారు. ఆ చర్యకు పాల్పడిన వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టు లక్ష్మణరావు వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో ఒక ప్రజా రాజధాని నిర్మించాలని భావిస్తున్నటువంటి టైములో ఇలా కుల వివక్షతకు పాల్పడడం చాలా దారుణమన్నారు. ఈ కుల వివక్షతను అంతమొందించాలి, ఎందుకంటే రాజధాని పౌరులందరి హక్కు. కాబట్టి ఇది రాజ్యంగ మూల సూత్రాలకే విరుద్దమని ఆయన ఖడించారు.అందుకని కులవ్యవస్థ ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని సామాజికంగా వ్యతిరేకించాలని రాజ్యాంగ పరంగా కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: