అంగవైకల్యం వారిని కృంగదీయలేదు ఎవరెస్ట్ అయినా సరే మరేదైనా సరే తమ ముందు తలవంచాల్సిందేనని నిరూపించారు. యాక్సిడింట్లో ఓ కాలు కోల్పోయినప్పటికీ తమ లక్ష్యానికి ఎవరెస్ట్ సలామ్ చేసింది. దివ్యాంగులైనప్పటికీ తాము ఎవరికీ తక్కువ కాదని ఆత్మ విశ్వాసంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు హైదరాబాద్ దిల్ షుఖ్ నగర్ కు చెందిన ఆర్యవర్థన్, హర్షద్ షేక్. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ నుండి ఈ యువకులంతా శిక్షణ పొందారు. ఆదిత్య ఫౌండేషన్ సహాయంతో డెహ్రాడూన్ లో జూలై నెలలో దివ్యాంగుల బృందం శిక్షణ తీసుకుంది. అనంతరం గంగోత్రి మౌంట్ భగీరథి నుంచి ఎవరెస్ట్ శిఖరాధిరోహణకు బయలుదేరారు. సుమారు పధ్ధెనిమిది వేల అడుగుల ఎవరెస్ట్ శిఖరాన్ని తెలుగు తేజాలు ఆర్యవర్థన్, హర్షద్ షేక్ ఆధిరోహించారు.


వీరితో పాటు మిగతా నలుగురు యువకులు కూడా ఇరవై ఒక్క వేల మూడు వందల అరవై నాలుగు అడుగుల అధిరోహించి రికార్డు సృష్టించారు. ప్రతి సంవత్సరం ఆదిత్య మెహతా ఫౌండేషన్ వారు ట్రైనింగ్ క్యాంప్ ని నిర్వహిస్తారు. అందులో పారాస్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తారు. వారి లక్ష్యం ముందు ఎవరెస్ట్ శిఖరం చిన్నబోయింది. దివ్యాంగులైనప్పటికీ తమ అనుకున్న లక్ష్యం ముందు ఏదైనా సాధించగలమని నిరూపించారు. ఇప్పటికే ఒక యాక్సిడెంట్ లో కాళ్లు కోల్పోయి పధ్ధెనిమిది వేల అడుగుల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినటువంటి తెలుగు తేజాలు ప్రస్తుతానికి సికింద్రాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీసులు వీరికి ఘన స్వాగతం పలికారు." మనం ఏదో ఒకటి చేయాలి అనేది మనం వూరికే కూర్చోకుండా ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగినాము. అలాగే ఆదిత్య సార్ కూడా బాగా ప్రోత్సహించారు.



మేము అనుకోలేదు అలా ఎక్కుతాం అని కానీ అక్కడ గ్లేషియర్ ఉంటుందని స్నో ఉంటదని మొత్తం, అది ఎప్పుడూ కరిగిపోతదో ఎప్పుడూ లోపలి కిందకెళ్తదో కూడా తెలియదు. అది చాలా డేంజరస్. మేము ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆదిత్య సార్ దగ్గర శిక్షణ తీసుకున్నాము . ఇక్కడ మనకు మౌలాలీ అని దర్గా ఉంది కదా అక్కడ చూసుకుని వెళ్ళే వాళ్ళు వెయిట్ తీసుకొని ట్రైనింగ్ ఇచ్చేవాళ్లు ఆదిత్య సార్. మేము ఈ లక్ష్యాన్ని సాధించడం పట్ల మా కుటుంబ సభ్యులు, బంధువులు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు అనుకోలేదు మామూలుగా ఇలా ఎక్కుతామని. అదీకాకుండా మోకాళ్లపైన కదా సార్ చాలా కష్టంగా ఉంటుంది. మోకాలి కింద అయితే ఇబ్బందేం ఉండదు. మోకాళ్లపైన కాబట్టి మాకు సార్ ఇంకోక ఆర్టిఫిషియల్ ఎక్స్ ట్రా కూడా  మొత్తం సెట్ చేసి ఇచ్చి పంపించారని" ఆర్వవర్ధన్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: