మొత్తానికి ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల.. ఎప్పటికి నెరవేరదేమోనని భయపెట్టిన కల.. ఎట్టకేలకూ  జగన్ పుణ్యమా అని నెరవేరబోతొంది.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తాజాగా  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అంగీకారం తెలిపారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నారు. గత ఎన్నికల్లో  భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా అవినీతి రహిత పాలనను అందిస్తానంటూ.. బాధ్యతలు చేపట్టిన  వైసీపీ అధినేత,  మొత్తానికి తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నాడు.  సంచలన నిర్ణయాలు తీసుకుని తన మార్క్ పాలన ఎలా ఉంటుందో తాజాగా ఈ నిర్ణయంతో  రుచి చూపించాడు.  ఆర్టీసీ ఉద్యోగుల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. రవాణా శాఖ మంత్రి పేర్ని నాని  మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ముఖ్యమంత్రి జగన్ ఆమోదించారని నాని స్పష్టం చేశారు.  అయితే  ఉద్యోగుల  విధి విధానాలను మాత్రం  త్వరలో ఖరారు చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు.  ఏమైనా ఉద్యోగ భద్రత లేకుండా ఆర్టీసీలో కార్మికులు పనిచేస్తున్నారు. జగన్   ఉద్యోగ భద్రత కల్పిస్తూ.. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడ్డారు.   


ఇప్పటికే  జగన్‌  తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మికులతో పాటు  యూనియన్‌ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.  తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అంగీకరించిన జగన్‌ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. అయితే  ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు అంగీకరించిన జగన్‌..  ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు ఇచ్చిన అన్ని డిమాండ్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ? ఇస్తే.. ప్రభుత్వం పై పడే అదనపు ఆర్ధిక భారం పరిస్థితి ఏమిటి ? ఇంతకీ ఇప్పటికే ఆర్ధికపరంగా కష్టాల్లో ఉన్న రాష్ట్ర వాణిజ్య స్థితిని పరిశీలించే  జగన్ ఈ  నిర్ణయం తీసుకున్నారా ? ఏది ఏమైనా ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం జగన్ కి ఎప్పటికి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కానీ  ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే అన్ని సౌకర్యాలు ఆర్టీసి ఉద్యోగులకు వర్తివస్తాయ..? వర్తించకపోతే.. అప్పుడు ఆర్టీసీ వాళ్ళ ఆశలు కోపాలుగా మారవని గ్యారింటీ లేదూ..అసలు ఇది పూర్తిగా సాధ్యమేనా ?  ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు జగన్  బాగా ఆలోచిస్తే బాగుంటుందని మేధావులు పెదవులు విరుస్తున్నారు.  తానూ ఇచ్చిన హామీల అమలు విషయంలో ఎంతో పట్టుదలతో  జగన్ ఉన్నప్పటికీ.. జగన్ ఇచ్చిన  హామీలు అమలు అనేది పూర్తిగా సాధ్యం కాదని, రాజకీయ  మేధావులు అభిప్రాయం. కానీ ఎన్నో ఆలోచనలతో ఉన్న జగన్, ఎలా హామీలను సంపూర్ణంగా నెరవేరుస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: