త్వరలో యూపీ కాంగ్రెస్ కొత్త బాస్ గా ప్రియాంక

పునర్వైభవం సాధించే క్రమంలో భాగంగా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక వాద్రా త్వరలోనియమితులు కానున్నట్లు సమాచారం.   ఇప్పటివరకు ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్లో తూర్పు ప్రాంతం మాత్రమే ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ ప్రాంతం ఇన్చార్జిగా శ్రీ జ్యోతిరాదిత్య సింథియా వ్యవహరిస్తున్నారు.   ఇకపై ఆమెకు పూర్తిస్థాయి లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొత్తం వ్యవహారాలు చూసుకునే విధంగా ఆమెను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జిగా నియమించనున్నట్లు సమాచారం .


ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ  రాజ్ బబ్బర్ పై ఉన్న అసంతృప్తితో చాలామంది నాయకులు రాష్ట్రంలో కాంగ్రెస్ కమిటీకి ప్రియాంక నాయకత్వం వహిస్తే గత వైభవాన్ని తిరిగి సొంతం చేసుకుంటుంది  అన్న ఆశాభావం తో ఉన్నట్లు తెలుస్తోంది. 


ప్రస్తుతం   ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 2022 అసెంబ్లీ ఎన్నికల  గెలుపు మాత్రమే లక్ష్యంగా పనిచేస్తుందని, రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గానికి తగు ప్రాధాన్యమిచ్చి,  జిల్లాల వారీగా కమిటీలు నియమించి పార్టీని బలోపేతం చేయనున్నట్లు సమాచారం. అలాగే ప్రతి జిల్లా కమిటీ మహిళా ప్రాతినిధ్యం తగినంతగా ఉండేటట్లు,  దళితులకు ఇతర సామాజిక వర్గాల వారికి సమ ప్రాధాన్యం లభించేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.



గత పార్లమెంట్ ఎన్నికలలో  శ్రీమతి సోనియాగాంధీ తప్ప మరి ఏ ఒక్క అభ్యర్థి కూడా గెలవ లేదన్నా విషయం అందరికీ తెలిసినదే.   80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ గారు కూడా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో పరాభవం చవిచూడటం చాలా బాధాకరమైన విషయం గా ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: