ఏ రంగంలో అయినా నాయకత్వ స్ధానంలో ఉన్న వారికి విశ్వసనీయత అన్నది చాలా ముఖ్యం. అందులోను ఇప్పటి రాజకీయాల్లో అయితే విశ్వసనీయత లేకపోతే నాయకుల మనుగడ అస్సలు సాధ్యంకాదు. అదే ఇపుడు చంద్రబాబునాయుడుకు సమస్యగా మారినట్లు అర్ధమైపోతోంది. ఘోర పరాజయం తర్వాత టిడిపిని వీడిపోతున్న నేతల విషయం చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది.

 

విశ్వసనీయత అన్నది వైఎస్సార్ వ్యక్తిత్వానికి పర్యాయపదంగా నిలిచిపోయింది. కాంగ్రెస్ లో వైఎస్సార్ ను రాజకీయంగా  వ్యతిరేకించే వారు కూడా విశ్వసనీయత విషయంలో కానీ వర్గాన్ని కాపుడుకునే విషయంలో కానీ ఎక్కడా తప్పు పట్టలేదు. ఎంత కష్టమొచ్చినా ఇచ్చిన మాట మీద నిలబడటమే విశ్వసనీయత.

 

ఈ విషయంలో వైఎస్సార్ గురించి కొన్ని వందల ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అదే చంద్రబాబు విషయానికి వస్తే ఎన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు అంటే వెతుక్కోవాల్సిందే.  టికెట్ల విషయంలో కానీ మంత్రిపదవుల విషయంలో కానీ పదవుల విషయంలో కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు చంద్రబాబు అని చెప్పుకోవటానికి ఒక్క ఉదాహరణ కూడా చూపలేరు.

 

మంత్రి పదవులు ఇచ్చినా, రాజ్యసభ అవకాశం, ఇతర పదవులు ఇచ్చినా అవసరాలను చూసి ఇవ్వటమే తప్ప మద్దతుదారులకు న్యాయం చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదని టిడిపిలోనే ప్రచారం జరుగుతోంది. అవసరాల కోసం మాత్రమే దగ్గరకు తీసుకుంటారు కాబట్టి పార్టీ ఘోర పరాజయం తర్వాత చాలామంది నేతలు టిడిపిని వదిలేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబుతో అవసరం తీరిపోయింది కాబట్టి నేతలు కూడా పార్టీని వదిలేస్తున్నారు.

 

వైఎస్సార్ తర్వాత అలాంటి లక్షణం జగన్మోహన్ రెడ్డికే ఉందని టిడిపి నేతలే అంగీకరిస్తున్నారు. తనతో పాటు తొమ్మిదేళ్ళు కష్టాలు పడిన వాళ్ళని నష్టపోయిన వాళ్ళకే జగన్ అగ్ర తాంబూలం ఇచ్చారు. కష్టాల్లో తనకు తోడుగా ఉన్న వారిలో మోపిదేవి వెంకటరమణ లాంటి చాలామందిని ముఖ్యమంత్రి కాగానే జగన్ అందలాలు ఎక్కించారు.  చూశారా విశ్వసనీయతకు  ప్రాధాన్యత ఎంతుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: