తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా వారీగా సమావేశాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. అయితే ఇందులో భాగంగానే మంగళవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ ఒక సమావేశాన్ని నిర్వహించారు. అయితే కేటీఆర్ సమక్షంలో జరిగినటువంటి ఈ సమావేశానికి కొందరు తెరాస పార్టీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారంట.  అయితే ఈ విషయం మీద కేటీఆర్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇక్కడ ఇంత సీరియస్ సమావేశం జరుగుతుంటే, ఇక్కడ ఎమ్మెల్యేలు ఇలా ఇంతలా నిర్లక్ష్యంగా ఉండటం ఏంటి అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దిశా నిర్దేశం చేస్తుంటే ఇలా ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం బాధ్యతా రాహిత్యాన్ని చూపిస్తుందని కేటీఆర్ అన్నారు.  అంతేకాకుండా త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మరియు బీజేపీ లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని, ఎలాగైనా సరే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వారందరికీ కూడా తగిన బుద్ది చెప్పాలంటే మన నేతలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ అన్నారు.  ఇకపోతే హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలపై కూడా కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 


అలాగే గత కొద్దీ రోజుల నుండి జరుగుతున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్… ఇకపోతే అందరు కూడా కలిసికట్టుగా సమన్వయంతో పని చేయాలనీ కేటీఆర్ సూచించారు. కాగా కేటీఆర్ సమక్షంలో జరిగినటువంటి సమావేశానికి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరావును కేటీఆర్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటినుండి కూడా కేవలం కెసిఆర్ కుటుంబం తప్ప తెలంగాణాలో ఎవరుకూడా బాగు పడలేదని, అంతలా అవినీతి చేస్తున్నారని కాంగ్రెస్ అండ్ బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. పైగా రాజకీయంగా యాక్టివ్ అవుతున్నాయి. ఆయా పార్టీలు.  దీనికి తోడు కేంద్రం నుండి సరైన సాయం అందించకుండా... కేసీఆర్  అడిగిన నిధులను ఇవ్వకుండా.. కేసీఆర్ కి  కనీస సపోర్ట్ కూడా చెయ్యకుండా ప్రతి విషయంలో అడ్డు తగులుతుంది.  పైగా లోకల్ నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటూ... తెరాస పార్టీకి పోటీగా బీజేపీ ఎదుగుతుంది.  మరి కేసీఆర్ బీజేపీని ఎలా అడ్డుకుంటారో..  ఈ క్రమంలోనే  కేసీఆర్ అండ్ కేటీఆర్  మొత్తానికి  కాస్త వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. అందుకే పక్కాగా ప్రణాళికలు చేస్తున్నారట.   


మరింత సమాచారం తెలుసుకోండి: