ముఖ్యమంత్రి జగన్ సెప్టెంబర్ నుంచి జిల్లాల టూర్లు పెట్టుకున సంగతి విధితమే. ఇంతకాలం ఆయన సచివాలయంలో సమీక్షలతోనే కాలం గడిపారు. వంద రోజుల పాలన పూర్తి అయిన సందర్భంగా జగన్ జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. సెంటిమెంట్ పరంగా అచ్చివచ్చిన శ్రీకాకుళం  నుంచి జగన్ టూర్ ప్రారంభించడం  విశేషం.  పాదయాత్రను ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జగన్ ముగించారు.


ఇపుడు అదే జిల్లా నుంచి ముఖ్యమంత్రి హోదాలో జగన్ పర్యటనలు మొదలు కావడం విశేషం. ఇదిలా ఉండగా ఈ నెల 6వ తేదీన జగన్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. జగన్ వేయి కోట్ల రూపాయలతో అభివ్రుధ్ధి పనులు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ సందర్భంగా అనేక ప్రాజెక్టులకు కూడా జగన్ శ్రీకారం చుడతారు. 


తాజా ఎన్నికల్లో మొత్తం పది అసెంబ్లీ సీట్లకు గాను ఎనిమిది ఇచ్చిన జిల్లా ప్రజల‌ రుణం తీర్చుకోవడానికి అనేక అభివ్రుద్ధి కార్యక్రమాలను జగన్ ఇక్కడ ప్రకటించనున్నారు. అందులో భాగంగా ఉద్దానం కిడ్నీ  బాధితుల కోసం  సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి జగన్ నిధులు మంజూరు చేశారు. అలాగే రేషన్ ద్వారా ఇచ్చే సన్న బియ్యం పధకాన్ని కూడా జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తారు.


పైలెట్ ప్రాజెక్ట్ గా శ్రీకాకుళం జిల్లాకే ఈ సన్నబియ్యాన్ని జగన్ తొలిగా ఇవ్వడం విశేషం. ఇక జగన్ పర్యటనలో తాను రూపొందించిన పధకాల గురించి జనం అభిప్రాయాలను నేరుగా తెలుసుకుంటారు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాను ఏ విధంగా అభివ్రుధ్ధి చేసేది కూడా విడమరచి చెప్పనున్నారు. మొత్తం జగన్ శ్రికాకుళం టూరు కి జిల్లా ముస్తాబవుతోంది.  జగన్ రాక కోసం అటు ప్రజానీకం, ఇటు వైసీపీ నేతలు కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. జగన్ తమకేమి వరాలు ఇస్తాడోనని అంతా ఎదురుచూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: