హైదరాబాద్ మల్కాజిగిరి లో నిన్న  భారీ  అగ్ని ప్రమాదం జరిగింది గణేష్ ఉత్సవాల్లో భాగంగా విష్ణుపురి  కాలనీ లోని ఒక  అపార్ట్ మెంట్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపు కుంటున్నారు అయితే గణేష్ మండపానికి నిప్పంటుకుని పక్కనే ఉన్న కార్లు ద్విచక్ర వాహనాలు కూడా కాలిపోయాయి. సమాచారం తెలిసిన వెంటనే  అగ్నిమాపక సిబ్బంది  వచ్చి  మంటలను అదుపు లోకి తెచ్చారు  కానీ ఈ‌లోపు   ప్రమాదం లో భారీగా ఆస్తి నష్టం జరిగింది.


ఈ అగ్ని ప్రమాదం లో ఎవరికీ ప్రాణహాని  కానీ  ఎటువంటి  ఆస్థి  నష్టం  జరగలేదు కేవలం వాహనాలు  మాత్రమే తగలబడ్డాయి అని సమాచారం.  అపార్ట్ మెంట్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం లో అఖండ దీపం వెలిగించారు  ఆ  అఖండ దీపం కింద పడడంతో మంటలు  అక్కడ   అంటుకున్నాయి,  అది  చూసిన  వెంటనే  అపార్ట్మెంట్ వాసులు   స్పందించి  తగు చెర్యలు తీసుకున్నారు.  వెంటనే  అగ్ని మాపక  సిబ్బంది  వచ్చి  మంటలని అదుపులోకి తీసుకు వచ్చారు.

ఈ ఘటన తెల్లవారు జామున జరిగింది అనుమానం వచ్చిన వెంటనే అపార్ట్మెంట్ వాసులు హుటహుటిన కిందకు వచ్చి అక్కడ దొరికిన నీటితో‌  దానిని ఆపే ప్రయత్నం చేశారు. అదే సమయం‌లో‌అగ్ని మాపక సిబ్బందికి సమాచారం‌  అందించారు. వారు వచ్చిన వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం  చేశారు. కానీ‌ ఈ‌ లోపే అక్కడ ఉన్న  ద్విచెక్ర వాహానాలతో‌ పాటు రెండు కార్లు కూడా చాలా వరకు ధగ్దం అయిపోయాయి.

అపార్ట్మెంట్ కి మంటలు అంటుకుంటున్న సమయానికి అగ్ని మాపక సిబ్బంది వచ్చి ఆపడం‌ వల్ల భారీ‌ ప్రమాదం‌ తప్పింది. అపార్ట్మెంట్ కింద వినాయకుడి విగ్రహాలు పెట్టూకుంటున్న వారు చాలా జాగ్రత్త గా ఉండాలని, తగు చర్యలు తీసుకోవాలని అగ్ని మాపక సిబ్బంది వారు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: