ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ కీలక  నిర్ణయాలు తీసుకుంది .  ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయడమే కాకుండా , పలాస లో కిడ్నీ ఆసుపత్రి ఏర్పాటు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . నవయుగకు పోలవరం హైడల్‌ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయానికి  మంత్రివర్గం ఒకే చెప్పింది . రివర్స్ టెండరింగ్ ను న్యాయస్థానం , కేంద్ర ప్రభుత్వం  ఆక్షేపిస్తున్న , రూ. 3216.11 కోట్ల టెండర్‌ రద్దుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది .రివర్స్‌ టెండరింగ్‌పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్‌ ఒకే చెప్పింది . కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీ చేయాలని  కేబినెట్‌ సమావేశం లో నిర్ణయించింది .

ఆశావర్కర్ల వేతనం రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ ప్రభుత్వం  తీసుకున్న నిర్ణయానికి   కేబినెట్‌ ఆమోదం తెలిపింది . 2018 ఆగస్టు నుంచి రూ. 1500 ఉన్న ఆశావర్కర్ల జీతం రూ.3వేలు  పెంచాలని , మరో రూ.3వేల రూపాయలు ప్రతిభ ఆధారంగా నిర్దేశించిన అప్పటి ప్రభుత్వం ఆశావర్కర్ల జీతాలను నేరుగా రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , ఈ నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది . మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాని మంత్రివర్గం నిర్ణయించింది .

పోర్ట్ పనులు ప్రారంభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్ని మంత్రివర్గం తెలిపింది . భూముల లీజు కూడా సదరు సంస్థ  చెల్లించలేదని కేబినెట్‌కు  పరిశ్రమల శాఖ   తెలియజేయడం తో , ఇప్పటికే పోర్ట్ కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వానికి మరింత వెసులుబాటు లభించింది . వోయిస్టులపై  కొనసాగుతున్న  నిషేధం మరో ఏడాది పొడిగించాలని  మంత్రివర్గం నిర్ణయించింది . 


మరింత సమాచారం తెలుసుకోండి: