అపర చాణక్యుడు అన్న పేరు చంద్రబాబు నాయుడుకి ఊరికినే ఇవ్వలేదు. రాజకీయ చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులుకొన్ని వందల పావులు కదిపిన ఆయన సమయానికి తగ్గట్లు వ్యూహాలు మార్చడంలో దిట్ట. అందుకే ఇప్పటికీ అవకాశవాద రాజకీయం అనగానే గుర్తొచ్చేది మన మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేరు. 
మొన్నటివరకు బాబు మోడీని ఎలా విమర్శించాడో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నాడు. ఆయన ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఎన్నికల సమయంలో కేంద్రంలో బిజెపికి మళ్లీ అధికారం దక్కదు అని తన లెక్కలు వేసుకున్న బాబు మోడీని గద్దె దించడమే లక్ష్యంగా దేశమంతా తిరిగారు. కానీ చివరికి మోడీ అఖండ మెజారిటీతో విజయం సాధించగా కంగుతిన్న బాబు కొత్త వ్యూహంతో అతనికి దగ్గరయ్యేందుకు బాగానే కసరత్తు చేశాడు. 

ఇప్పుడు చంద్రబాబు మళ్లీ బిజెపి పొందు కోరేందుకు మోడీ అపాయింట్మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ తనపై అంత బురద జల్లిన మోడీ చంద్రబాబుకు అంత తేలికగా అపాయింట్మెంట్ ఎలా ఇస్తాడు? ఇక్కడే బయటకు వస్తుంది మన చంద్రబాబు అసలైన పనితనం. అతని పార్టీలో నుంచి బీజేపీ లోకి వెళ్ళిన నలుగురు మంత్రులు అయిన సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, మరియు టీజీ వెంకటేష్ ల ద్వారా బాబు మోడీ అపాయింట్మెంట్ కోసం ప్రస్తుతం తిరుగుతున్నారట. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే వారు బాబుకు మరియు మోడీకి మధ్యరిక వ్యవహారం నడిపేందుకు సిద్ధంగా ఉన్నారట.

ఒకవేళ బాబుకు మోడీ అపాయింట్మెంట్ కనుక దొరికితే బాబు సరికొత్త రాజకీయాలని స్తార్ట్ చేస్తాడు. అప్పుడు ఈ నలుగురు మంత్రులు బిజెపిలో ఉంటే ఏంటి... టిడిపి లో ఉంటే ఏంటి? అసలే తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా చంద్రబాబు తనకై తానే వచ్చి ఆఫర్ ఇస్తాను అంటే కాదనగలడా? బాగా బలహీన పడిపోయిన తన పార్టీ కనీసం నిలదొక్కుకునేందుకు అయినా బీజెపీతో మంతనాలు జరిపి సీట్ల సర్దుబాటు విషయం చేసుకుంటాడు బాబు. తర్వాత జరగాల్సింది అంతా మోడీ చూసుకుంటాడు అనుకోండి… అది వేరే విషయం కానీ నలుగురు మంత్రులను ఏమైనా ప్లాన్ తో బీజేపీలోకి పంపాడా మన బాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: