సొంతగా ప్యాసింజర్ ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్ లు నడుపుకునే వారికి ఏడాదికి పది వేల రూపాయలు ఇచ్చేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీనిలో భార్యాభర్త ఒక యూనిట్ గాను, వారి కుటుంబంలో మేజరైన కొడుకు గాని, కూతురు గాని ఇదే వృత్తిలో గనక అంటే  ఆటో గాని, కారుగాని మేజరై ఉండి నడుపుకుంటుంటే గనుక వారిని సపరేట్ యూనిట్ గా చూడటం జరుగుతుంది.


భార్యాభర్తలు కలిసి ఒక యూనిట్ గా ఏర్పడి, వారి పిల్లలకు పెళ్లికాకుండా మేజరై ఉంటే గనుక వారు సోంత ఆటో లేదా కారుకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఆ వృత్తి మీద జీవిస్తున్న వారికి ఈ పది వేల రూపాయలు లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. ఈ సదుపాయం ఇన్సూరెన్స్ కి కానీ, ఫిట్ నెస్ కి కాని, రిపేర్లకు ఈ ఆర్థిక సాయంను జగన్ మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వం నిర్ణయించటం జరిగింది.


ఈ క్యాబినెట్ నిర్ణయం వలన సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయల వ్యయం ధర సుమారుగా నాలుగు లక్షల మందికి లబ్ది చేకూరబోతోందని అభిప్రాయబడ్డారు.ఇది మా దగ్గరున్నటువంటి ప్రాథమిక సమాచారంతో ఒక అంచనాకి వచ్చారు.దానిని రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ లో పదో తారీఖు నుంచి దరఖాస్తులను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ సెప్టెంబర్ పదో తారీఖు నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు లభ్యమయ్యే లాగా చేశారు. ప్రభుత్వ అంచనాల కన్నా మించి గనుక అప్లికేషన్స్ వస్తే ఎంతయినా దాన్ని బాధ్యతగా తీసుకుని, వారికి చెల్లించటానికి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.


సెప్టెంబర్ నాలుగో వారంలో దరఖాస్తులు అన్నీ ఒక్కసారి పరిశీలించిన తర్వాత మున్సిపల్ కమిషనర్ లు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో దరఖాస్థూ దారులు గ్రామీణ ప్రాంతాల నుంచి అయితే గనుక ఎండివో గారు, మున్సిపాలిటీలో అయితే గనక మున్సిపల్ కమిషనర్ లు ఈ పథకానికి మంజూరు ఇస్తారు. సరాసరి వారి బ్యాంక్ అకౌంట్ లకే డబ్బును జమ చేస్తారు.డబ్బు చేరిన తర్వాత రసీదులను గ్రామా లేదా వార్డు వాలెంటరీల ద్వారా చేరవేయటం జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియను నెలాఖరు లోపు చేస్తామని ప్రజలందరికీ తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: