జమ్మూ కాశ్మీర్ విషయంలో 72 సంవత్సరాలుగా నలుగుతున్న సమస్యకు 72 గంటల్లో బీజేపీ ప్రభుత్వం పరిష్కారం చూపింది.  అయితే,  కాశ్మీర్ లో ఈ విషయంలో చాలా వరకు ప్రశాంతత ఏర్పడింది.  సున్నితమైన సమస్యలుండే ప్రాంతాల్లో కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ సమస్యను ఓ కొలిక్కి తీసుకురావడంతో పాక్ మండిపడుతున్నది.  


కాశ్మీర్ ను అడ్డం పెట్టుకొని పాక్ ఇండియాను సాధించాలని చూసింది. ఆ పప్పులు ఉడకలేదు. అయితే, ఇండియా లోపల కూడా ఈ విషయాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఉన్నారు.  ఈ వరసలో ముందు ఉన్నది డీఎంకే పార్టీ. దేశంలో ఆర్ధిక మాద్యం పడగ విప్పుతున్న సమయంలో దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కాశ్మీర్ అంశానని తెరమీదకు తీసుకు వచ్చిందని స్టాలిన్ అంటున్నారు. 


అదే విధంగా చిదంబరం విషయంలో కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యిందని, ఆర్థికశాఖ మంత్రిగా చేసిన చిదంబరం ఆర్ధిక మాద్యం విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అని చెప్పి ముందుగానే ఆయన్ను సీబీఐ కేసుల్లో ఇరికించినట్టు స్టాలిన్ చెప్తున్నాడు.  స్టాలిన్ చెప్తున్నట్టుగా ఆర్ధిక మాధ్యం నుంచి దృష్టిని మరల్చేందుకు కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది అనుకుంటే పొరపాటే.  


జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని 2014 మ్యానిఫెస్టోలో బీజేపీ పెట్టింది.  దాన్ని అమలు చేసింది అంతే.  ఒక్క బీజేపీ మాత్రమే కాదు.. చాలా పార్టీలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి.  చివరకు కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్టికల్ 370 రద్దును సమర్ధిస్తోంది.  అలాంటిది ఇప్పుడు స్టాలిన్ ఇలా మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏంటో అర్ధం కావడం లేదు.  ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పెట్టుబడులను ఆహ్వానించేందుకు మూడు దేశాల్లో పర్యటిస్తున్నారు.  దీనిపై కూడా స్టాలిన్ వ్యాఖ్యలు చేయడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: