ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.  రాజకీయాల్లోకి వచ్చిన  గ్రామాలలో  తీసుకున్నారు.  అలా గ్రామాల్లో పర్యటించే సమయంలో పవన్ కళ్యాణ్ చాలా విషయాలు తెలుసుకున్నాడు.  గ్రామాల్లో పర్యటిస్తూ.. అక్కడి సమస్యలపై అవగాహనా తెచ్చుకున్నాడు.  తిరిగింది కొన్ని గ్రామాలే. తిరగాల్సినవి చాలా ఉన్నాయి.  


ఎలాగో పవన్ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు కాబట్టి, ఈ సమయాన్ని పవన్ కళ్యాణ్ పూర్తిగా గ్రామాల్లో తిరగడానికి కేటాయిస్తే మంచిది.  గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి.. కార్యకర్తలను రిక్రూట్ చేసుకోవాలి.  కార్యకర్తలను రిక్రూట్ చేసుకుంటేనే పవన్ ఏ పనినైనా చేయగల సమర్ధత వస్తుంది. అమరావతిలో పర్యటించినట్టుగానే అటు రాయలసీమ గ్రామాల్లో కూడా పవన్ పర్యటిస్తే మంచిది.  


పవన్ కు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నది.  అందులో సందేహం అవసరం లేదు.  కాకపోతే ఆ ఫాలోయింగ్ ను పవన్ రాజకీయాల వైపు మలుచుకోవడంలోనే విఫలం అవుతున్నాడు.  పవన్ తరువాత లీడర్ ఎవరు అన్నది అక్కడ ప్రశ్నర్ధకంగా మారింది.  పవన్ లాంటి నాయకులు జనసేన పార్టీకి చాలా అవసరం.  సమర్ధవంతమైన యువకులను పవన్ పార్టీ రిక్రూట్ చేసుకోవాలి.  పైగా పవన్ కు ఆర్ధిక ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని పరిష్కరించుకోవాలి.  


ఇటీవలే పవన్ పుట్టినరోజు సందర్భంగా అతని అభిమానులు, కార్యకర్తలు జనసేన కోసం ఫండింగ్ సేకరించాలని లక్ష్యంగా ఇది పార్టీకి మంచి విషయం అనే చెప్పాలి.  రిక్రూట్ మెంట్ జరుగుతుంటే ఫండింగ్ అదే వస్తుంది.  ఫండింగ్ వస్తే పార్టీ పనులు మమ్మురం అవుతాయి.  పవన్ ఇక దూకుడు పెంచాల్సిన సమయం వచ్చింది.  మరో నాలుగేళ్లలో పవన్ పార్టీ గ్రామ స్థాయిలో పట్టు సంపాదించి విజయం సాధించడానికి అనుకూలమైన పవనాలు వీచే విధంగా చేసుకోవాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: