కొన్ని సంఘటనలు చాలా వింతగా ఉంటాయి.. అలానే భయాన్ని కలిగించేవిగా ఉంటాయి.  అలాంటి వాటిని చూసినపుడు భయం కలుగుతుంది.  మాములుగా చిన్న చిన్న పాములను చూస్తేనే భయపడి పారిపోతాం.  లేదంటే.. దాన్ని చంపేస్తాం.  అదే కొండచిలువ కనిపిస్తే.. అక్కడ ఉంటామా చెప్పండి.  ఒక్క పరుగు అందుకోము.. కానీ, చైనాలో మాత్రంఅలాకాదు .  కొండచిలువ కనిపిస్తే.. అది తిన్నది కక్కించే వరకు నిద్రపోరు అక్కడి మనుషులు.  


తిన్నది కక్కించడం ఏంటి అని షాక్ అవ్వకండి.. మనకు బాగా ఆకలేస్తే ఏంటది అని కూడా చూడం.. తినేస్తాం.  కడుపునిండిన తరువాత వేరే  దాని గురించి ఆలోచిస్తాం. ఏ జంతువైనా అంతే.. ఆకలేస్తే దేన్నీ వదలదు.  అలానే కొండచిలువకు ఆకలేస్తే.. మనిషినైనా సరే అమాంతం మింగేస్తుంది.  వెనక్కి తిరిగి చూసుకోదు.  ఇటీవలే చైనాలో ఓ వ్యక్తి మేకల మందను తోలుకుంటూ వెళ్ళాడు.  ఆ మందలో ఒక మేక కనిపించలేదు.  


వెంటనే ఆ వ్యక్తి చుట్టూ చోడగా అక్కడ అతనికి ఓ కొండచిలువ కనిపించింది.  అప్పటికే మేకను మింగేసింది.  వెంటనే ఆ వ్యక్తి కొంతమందిని పిలిచి ఆ కొండచిలువను చంపకుండా ఆ కొండచిలువను పైకి ఎత్తి పట్టుకున్నారు.  అలా దాన్ని పైకి ఎత్తి పట్టుకొని కుదేయడం వలన ఆ కొండచిలువ మింగిన మేక బయటకు వచ్చింది.  


ఈ దృశ్యం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు  ఆకట్టుకుంది.  కొండచిలువను చంపకుండా బయటకు తీసిన దృశ్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.  ఇది నిజంగా సహాయంతో కూడిన విషయమని చెప్పాలి. ఎందుకంటే ఇలా చేయడం ఒకందుకు మంచిదే అయినా.. ఆ తరువాత అది మరొక జంతువును మింగకుండా ఉంటుందా చెప్పండి. అయితే, చైనాలో కొంతమంది కొండచిలువలను చంపకుండా వదిలేస్తుంటారు.  వాటిని చంపడం పాపంగా భావిస్తారు.  వాటి స్వేచ్ఛను కోరుకుంటారట వాళ్ళు. 


మరింత సమాచారం తెలుసుకోండి: