అరుదైన రికార్డ్. ఆశ్చర్యానికి గురిచేసే సంచలన విషయం. ఊహకు అందనిది. అదినా నమ్మలేని నిజం. ఈ సమాజం నిత్య పరిణామశీలి కాబట్టి ఎప్పుడూ కొత్త కొత్త రికార్డులు సంచలనాలతో దూసుకుపోతుంటుంది. మనిషి తన జీవితంలో చూడలేము అనుకున్న వాటిని కూడా సైన్స్ చేసి చూపిస్తోంది. ఈరోజు 74 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన వృద్ధురాలికి శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. శస్త్ర చికిత్స ద్వారా ఇద్దరు ఆడపిల్లలను తీశారు. ఇదో అద్భుతంగా అంతా టాక్ ఆఫ్ సొసైటీగా మారిపోయింది. 


తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962లో వివాహమైంది. పెళ్లై ఎన్నాళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఏళ్లు గడిచినా వారికి పిల్లలు కలగలేదు. ఇద్దరూ వృద్ధాప్యంలోకి అడుగుపెట్టినా ఆ కోరిక అలానే ఉండిపోయింది. వీరు ఎక్కడికి వెళ్లినా డబ్బు ఎంతుంది అని కాకుండా పిల్లలు ఎంతమంది అని అనడం తమను చాలా బాధించిన అంశంగా వారు పేర్కొనడం విశేషం.


అయితే ఈ మధ్యనే వారి ఇంటి దగర్లో ఒక మహిళ 55 ఏళ్ల వయసులో కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో తల్లి అయ్యారు. దీంతో కాస్త కలిగిన కుటుంబమే కావడంతో తానూ పిల్లల కోసం ఆ పద్ధతిని ఆశ్రయించాలని మంగాయమ్మ నిర్ణయించుకొని ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఆమె మంగాయమ్మ మెనోపాజ్‌ దశ దాటిపోవడంతో వేరే మహిళ నుంచి అండాన్ని మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని సేకరించిణ వైద్యులు ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) పద్ధతిలో ప్రయత్నంచి విజయవంతం అయ్యారు.


కాగా ఈ ఏడాది జనవరిలో గర్భం దాల్చిన ఆమెకి వయసు రీత్యా సాధారణ ప్రసవం కష్టం కాబట్టి సిజేరియన్‌ ద్వారా ఈరోజు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న కవలలను బయటకు తీశారు. కాగా ప్రస్తుత లెక్కల ప్రకారం గతంలో భారతదేశంలో 72 సంవత్సరాల వయసులో ఒకామె పిల్లలకి జన్మనిచ్చింది. అప్పట్లో అది రికార్డ్. ఇప్పుడు 74 ఏళ్ల వయసులో మంగాయమ్మ బిడ్డను కంటే ఆ రికార్డ్ అయింది. మరి ఇది ఏ రికార్డ్ లకు ఎక్కనుందో..ఎన్ని వింతలను ప్రదర్శించనుందో వేచి చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: