ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి కుల రాజకీయాలను తేరాపైకి తీసుకొచ్చారు. ట్విట్టర్ వేధికగా వైసీపీ పార్టీ కులం కోసం పుట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు. మత ఘర్షణలు సృష్టించడం, కులాల మధ్య చిచ్చుపెట్టడం వైసీపీ పుట్టుకతో వచ్చిన సిద్ధాంతం అంటూ అయన ట్విట్టర్ లో పేర్కొని ప్రజల చేత చివాట్లు తింటున్నాడు చంద్రన్న. 


వైసీపీ పార్టీ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు పుడితే, బలహీనవర్గాల కోసం, సామాజికన్యాయం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అంటూ ప్రగల్భాలు పలికాడు చంద్రబాబు. అయితే ఈ వ్యాఖ్యలను నెటిజన్లు ఖండిస్తూ చంద్రబాబు నాయుడుకి గతాన్ని గుర్తు చేశారు నెటిజన్లు. గతంలో అతను కులాలను అడ్డుపెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టిన ఘటనలన్నింటిని కామెంట్ల రూపంలో పెడుతున్నారు. 


చంద్రబాబు వ్యాఖ్యలపై కామెంట్లు పెడుతూ గతంలో 'చంద్రబాబు గారు మీరు ఏం మాట్లాడారో గుర్తుందా ? ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలని అనుకుంటారా ? అని అన్నారు. ఇప్పుడేమో సామాజిక న్యాయం కోసం పుట్టిన పార్టీ అని అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మీ మాటలను నమ్మరు లెండి .. అంటూ కొందరు కామెంట్లు పెడితే .. 


మరికొందరు స్పందిస్తూ 'పెయిడ్ ఆర్టిస్టులతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారిని కులం పేరుతో దూషించింది మీరు కాదా? మీ తెలుగు దేశం పార్టీ నేతలే కులం పేరుతో దూషించడం.. దానిని మీరు సమర్దించడం.' అంటూ ట్విట్ పెట్టారు మరికొందరు నెటిజన్లు. ఏది ఏమైనా కులం పేరుతోనే రాజకీయాలలో నిలబడిన చంద్రబాబు మరో పార్టీపై ఇలాంటి కామెంట్లు చెయ్యడం ఏమాత్రం సరికాదు అని అంటున్నారు విశ్లేషకులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: