2004 నుంచి 2014 వరకు పది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండి...కొనఊపిరితో కొట్టుమిట్టాడిన సీనియర్ తెలుగుదేశం నేతలు..  2014 లో అధికారంలోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అధికారంలోకి రావడమే తరువాయి మంచి పదవులు దక్కించుకున్నారు. అలాగే పాలనలో దిగి మరో 10 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామని, ఈలోపే పదవులు అనుభవించేసి రిటైర్ అయిపోవాలని అనుకున్నారు. కానీ వారి ఆశ ఐదు సంవత్సరాల్లోనే ఆవిరైపోయాయి.


2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయి కేవలం 23 సీట్లకే పరిమితమైపోయింది. దీంతో చాలామంది నేతలు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోగా, మరికొందరు రాజకీయ సన్యాసం వైపు పయనిస్తున్నారు. ఆ రాజకీయ సన్యాసం వైపు వెళ్ళే ఎక్కువ మంది మాజీ మంత్రులే కావడం గమనార్హం. రాజకీయ సన్యాసం తీసుకునే నేతల్లో మొదటగా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. 2014 లో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ ఎమ్మెల్సీ అయిపోయి మంత్రి పదవి దక్కించుకున్నారు.  ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఈయన మొన్న ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తేడాతో అనిల్ కుమార్ యాదవ్ చేతుల్లో ఓడిపోయారు.


ఇక ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన పెద్దగా అడ్రెస్ లేరు. పార్టీలో యాక్టివ్ గా లేరు. జగన్ ప్రభుత్వం ఎక్కడ తమ విద్యాసంస్థలపై నిఘా పెడుతోందో అని సైలెంట్ అయిపోయారు. పైగా నారాయణ కూతురు ఇటీవల జగన్ ని కలిసి నారాయణ ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నారాయణ మీడియా ముందు కనపడటం లేదు. అసలు సైలెంట్ గా ఉండటమే కాకుండా ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


ఇక ఎప్పుడో ఎన్నికల్లో పోటీ చేయడం మానేసిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా మెల్ల మెల్లగా రాజకీయాలకు దూరమవుతున్నట్లు కనపడుతోంది. అలాగే మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా కుమారుడు విజయ్ కు బాధ్యతలు అప్పగించేసి  తాను సైలెంట్ అయిపోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటు అనేక వివాదాల్లో చిక్కుకున్న మాజీ స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివ ప్రసాద్ అసలు రాజకీయాల జోలికి వెళ్లొద్దని ఫిక్స్ అయిపోయారని సమాచారం. కుమారుడు, కుమార్తె చేసిన ఘనకార్యాలకు కోడెల సైలెంట్ అయిపోనున్నారు.


అదేవిధంగా వరుసగా 2004, 2009, 2012, 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయాల పట్ల పూర్తిగా విసుగుచెందినట్లు తెలుస్తోంది. ఆయన కూడా కుమారుడికి  బాధ్యతలు అప్పగించేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పేయాలని చూస్తున్నారని సమాచారం. ఇక సీనియర్ నేతలు అంతా ఓడిపోయినా ఆరోసారి గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరీ కూడా నెక్స్ట్ ఎన్నికల నుంచి పోటీక చేయనని ఇప్పటికే ప్రకటించేశారు కాబట్టి ఇక ఆయన కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: