వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని రైతులకు మేలు చేకూరేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. వైయస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం 12,500 రుపాయలు రైతులకు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 15 వ తేదీ నుండి రాష్ట్రంలో ఈ పథకం అమలు కాబోతుంది. 
 
రైతులకు గిట్టుబాటు ధరల కోసం  3000 కోట్ల రుపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసారు. ఆత్మహత్య చేసుకున్న లేక చనిపోయిన రైతు కుటుంబానికి వైయస్సార్ బీమా ద్వారా 7 లక్షల రుపాయలు ప్రభుత్వం పరిహారం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. అక్వా రైతులకు కరెంట్ ఛార్జీలను యూనిట్ కు రుపాయిన్నరకు తగ్గించేలా నిర్ణయం తీసుకున్నారు. 2000 కోట్ల రుపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసారు. 
 
ప్రతి నియోజకవర్గంలో అవసరాలకు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయటంతో పాటు శీతల గిడ్డంగులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కౌలు రైతులకు పంట మీద మాత్రమే హక్కు ఉండేలా కౌలు దార్ల చట్టం తీసుకొస్తున్నారు. సీఎం ఛైర్మన్ గా వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. వైయస్సార్ బీమా పథకం ద్వారా రైతు పండించే పంటలకు ప్రభుత్వమే బీమా చేయించి ప్రీమియం చెల్లించేలా నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నారు. 
 
2018 ఖరీఫ్ కరువుకు సంబంధించిన 2000 కోట్ల రుపాయల ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేసారు. ధాన్యం సేకరణ కొరకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలకు సంబంధించిన 360 కోట్ల రుపాయలు విడుదల చేసారు. శనగ రైతుల కొరకు 300 కోట్ల రుపాయలు బోనస్ గా విడుదల చేసారు. పామ్ ఆయిల రైతులకు అదనపు మద్దతు ధర కోసం 80 కోట్ల రుపాయలు విడుదల చేసారు. పులివెందులలో అరటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయటంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: