గురువారం నుండి రాష్ట్రంలోని కొన్ని రీచుల నుండి ఇసుక సరఫరా మొదలైంది. కొన్నిచోట్ల ఇబ్బందులు ఎదురైందనుకోండి అది వేరే సంగతి.  జగన్మోహన్ రెడ్డి ముందుగా చెప్పినట్లుగానే సెప్టెంబర్ 5వ తేదీ నుండి ఇసుకను అందుబాటులోకి తెచ్చారు. ఇసుక టన్ను ధర రూ 375గా సరఫరా ప్రారంభమైంది. ఓ నాలుగు రోజులు జరిగితే కానీ సరఫరాలో ఎదురయ్యే సమస్యలు బయటపడవు లేండి.

 

మొత్తం ఇసుక వ్యవహారమంతా ఏపిఎండిసి ద్వారానే జరుగుతుందని  ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏపిఎండిసి ఓ వెబ్ సైట్ రూపొందించింది కూడా.  ఇసుక రవాణాకు ప్రత్యేకంగా జిపిఎస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 10 కిలోమీటర్ల లోపు ఇసుక సరఫరాకు మాత్రం ట్రాక్టర్లను అనుమతిస్తారు. 10 కిలోమీటర్ల దూరం దాటితే మాత్రం లారీలను వాడాల్సిందే.

 

ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జగన్ అన్నీ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం 41 స్టాక్ పాయింట్లతో మొదలైన ఇసుక సరఫరా తొందరలో మరిన్నింటిని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

 

మొత్తం మీద ఇసుక లభ్యతలో వినియోగదారులు కొంత ఇబ్బందులు పడిన  మాట వాస్తవమే.  అందుకనే చంద్రబాబునాయుడు, లోకేష్ తదితరులు బాగా పెద్ద ఇష్యు చేసేశారు.  ఆగిపోయిన నిర్మాణాలన్నింటకీ  ఇసుక కొరత కారణం కాదు. ఆర్ధికమాంధ్యం కూడా పెద్ద కారణమే. కానీ ఆర్దిక మాంధ్యాన్ని పక్కనపెట్టేసి కేవలం ఇసుక కొరతను మాత్రమే హైలైట్ చేశారు.

 

ఇసుక సరఫరా మొదలవ్వటం వల్ల భవిష్యత్తులో చంద్రబాబు అండ్ కో కు ఇక కొరత పై మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు. ప్రారంభంలో కొంతమేరే ఇసుక రీచులు ప్రారంభమవుతున్నా పోను పోను మరిన్ని రీచులను అందుబాటులోకి తేవాలని ఏపిఎండిసిని జగన్ ఆదేశించారు. కొత్త పాలసీతో మొదలైన ఇసుక సరఫరాను ప్రభుత్వం గనుక పక్కాగా నిర్వహించగలిగితే పాపం చంద్రబాబు, లోకేష్ తో పాటు మొత్తం టిడిపి నేతలకు ఆరోపణలకు, విమర్శలకు ఇక ఇసుక ఇష్యు ఉండదేమో ?


మరింత సమాచారం తెలుసుకోండి: