భారత దేశం కీర్తీ విశ్వమంతా వ్యాపించగా,తన సత్తా మరోసారి ప్రపంచ దేశాలకు తెలిసే క్షణాలు దగ్గర పడుతున్నాయి.ఇన్నాళ్లు ఎదురుచూపులతో కోట్ల మంది భారతీయుల గుండెలు చంద్రయాన్ 2 అని కొట్టుకునే సవ్వడికి ఊపిరి అందించి,ఉచ్చ్వాస క్రియను వేగవంతం చేసే సమయం ఆసన్నమవుతుంది.చిన్నప్పుడు చందమామాను చూస్తూ ఆనందించే వాళ్లం.ఇప్పుడు చందమామపై అడుగు పెట్టి,రహస్యాలను చేధించడంలో ఎంతగానో సంతోష పడుతున్నాం.అంతరిక్ష ప్రయోగాలలో ఒక్కప్పటి భారత్,ఎక్కడ ఇప్పటి భారత్ ఎక్కడ ఇన్నేళ్ల కృషిలో ఎంత ఎత్తుకు ఎదిగామో ఇప్పుడు మనం చేస్తున్న,చూస్తున్న ప్రయోగాలు,అందులో సాధిస్తున్న విజయాలు నిదర్శనం.ఇక ఇప్పుడు ప్రపంచదేశాల కళ్లన్ని భారత్ వైపే చూస్తున్నాయి.ఒక యుద్ధం ముగిసాక ఏర్పడే నిశబ్ధం ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు ప్రపంచం అంతా అలానే వుంది.దానికి కారణం చంద్రయాన్ 2.మరో అద్భుత ఘట్టానికి మరికొన్ని గంటలే సమయం వుంది.



ఎందుకంటే భారత అంతరిక్ష సంస్థ చంద్రమామ నిగూఢ రహస్యాలను ఛేదించటానికి చేపట్టిన ప్రయోగాలలో రెండో ప్రయోగం ఇది.మొట్టమొదట పదేళ్ళ క్రితం 2008 అక్టోబర్‌లో చంద్రయాన్‌ వన్‌ ప్రయోగించారు.ఆ ఉపగ్రహం 312 రోజు పాటు చంద్రుడి కక్ష్యలో తిరిగింది.ఇక అప్పటి ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ చంద్రయాన్ మిషన్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు.చంద్రయాన్-1 అన్వేషణలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పుడు చంద్రయాన్-2ను పంపిస్తున్నారు.నాలుగు టన్నుల బరువు ఉన్న ఈ అంతరిక్ష నౌకలో ఒక లూనార్‌ ఆర్బిటర్‌,ల్యాండర్‌,రోవర్‌ ఉన్నాయి.ఆర్బిటర్‌ చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ ఉంటే,ల్యాండర్‌ దాన్నుంచి విడివడి చంద్రుడి ఉపరితరలం పై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం పని చేస్తుంది.ల్యాండర్‌ చందమామపై విజయవంతంగా కాలు పెట్టగానే రోవర్‌ దాన్నుంచి విడిపోయి పరిశోధనా కార్యక్రమాన్ని చేపడుతుంది.



ఈ రోవర్‌ చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ అక్కడి మట్టి,రాళ్ల నమూనాలు సేకరించి అక్కడే రయానిక విశ్లేషణ చేయడంతో పాటు,చంద్రుని వాతావరణం పై అధ్యయనం చేసి ఆ సమాచారాన్ని ల్యాండర్‌కు అందజేస్తే,ఆ సమాచారం ల్యాండర్‌ ద్వారా భూమిపై ఉన్న ఇస్రో అనుసంధానించే కేంద్రానికి చేరుతుంది.. 14రోజులపాటు రోవర్ ఈ పరిశోధనా కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా సాఫ్ట్‌వేర్ రూపొందించారు శాస్త్రవేత్తలు.ఈ లోపు చంద్రుని కక్ష్యలో తిరిగే ఆర్బిటర్ చంద్రుని ఉపరితల ఫొటోలను తీసి ఇస్రో కేంద్రానికి పంపుతుంది.ఇక జాబిలితో దోబుచులాడుతున్న ఘట్టానికి చంద్రయాన్ 2లో అతి కీలకమైన చివరి క్షణం సెప్టెంబర్ 7న శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.40గంటలకు అని చెప్పవచ్చూ,చంద్రుడి కక్ష నుంచి కిందకు దిగే క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు విక్రమ్ లాండర్‌కు ఆదేశిలిస్తారు.ఆ సమయంలో చంద్రుడిపై దిగే  లాండర్‌ 35x100 కిలో మీటర్ల కక్ష్యలో,గంటకు 6120 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది.ఇక ఆసమయంలో భారతీయుల కళ్లల్లో కనిపించే కోటికాంతుల వెలుగులను చూసిన జాబిలి కూడ చినబోతుం దేమో... 


మరింత సమాచారం తెలుసుకోండి: