తెలుగుదేశంపార్టీలో కొందరికి పిచ్చి బాగా ముదిరిపోయింది.  ఎంతగా అంటే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా  కూడా చంద్రబాబునాయుడే తమకు ముఖ్యమంత్రి అని ప్రకటించుకునేంతగా. వినటానికే విచిత్రంగా ఉన్నా ఇది ముమ్మాటికి నిజం. నేతలు, కార్యకర్తలను చంద్రబాబు కలిసి మాట్లాడారు. ఆ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి మాట్లాడిన మాటలు విచిత్రంగా ఉంది.

 

మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అంగీకరించేది లేదని చెప్పారు. జగన్ ను సిఎంగా అంగీకరించనని చెబుతూనే ఇప్పటికీ చంద్రబాబే సిఎం అని  ప్రకటించటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ అధినేత ప్రతిపక్ష నేత అవుతారే కానీ ముఖ్యమంత్రి ఎలా అవుతారో దాదాపు 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న గల్లా అరుణకుమారికే తెలియాలి.

 

అన్నిటకన్నా విచిత్రమేమిటంటే గల్లా ప్రకటన చేసినపుడు చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. గల్లా ప్రకటన విన్న జనాలు ఏమనుకుంటారన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా అక్కడున్న వారిలో ఎవరికీ లేకుండాపోయింది. ఇదంతా విన్న వారికి ఎన్నికల్లో తగిలిన దెబ్బకు టిడిపి నేతల బుర్రి దొబ్బందనే అనుకున్నారు.

 

పై ఫొటోను చూసిన వారికి ఎవరికైనా గల్లా అరుణకుమారి ప్రకటనకు కొనసాగింపే అని అనిపిస్తుంది.  జైంట్ సైజ్ వినైల్ పోస్టర్లో రాసిన రాతలు టిడిపి నేతల పైత్యానికి అద్దం పడుతుంది. ప్రభుత్వంలో ఎవరున్నా పరిపాలన మాత్రం తమదే అట.  రాజ్యం ఎవరిదైనా రాజసం మాత్రం వాళ్ళదేనట. అధికారం ఎవరిదైనా ఆధిపత్యం తమదేనట. శాసనం ఎవరిదైనా శాసించేది మాత్రం వాళ్ళేనట.  

 

వినైల్ పోస్టర్లో ఒకవైపు చంద్రబాబు ఫొటో ఉంటే మరోవైపు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఫొటో ఉంది. ఈ రెండు ఫొటోల మధ్య పెద్ద సైజులో వినాయకుడి ఫొటో ముద్రించారు.  అలాగే పైన నందమూరి తారకరామారావు, పరిటాల రవి, నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరి ఫొటో ఎవరిదనే విషయంలో క్లారిటి లేదు. ఇన్ని ఫొటోలు వేసిన వారు మరి నారా లోకేష్ ఫొటోను ఎందుకు వేయలేదో మాత్రం  తెలియదు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: