అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు పార్టీని పట్టించుకోలేదు. అప్పట్లో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అధినేతకు వివరిద్దమన్నా కుదరలేదు అని ఎన్నికల అనంతరం నాయకులెందరో అన్నారు. అందులో ముఖ్యులు టీడీపీ కాపు నాయకులు. ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా కాపు నాయకులు టీడీపీపై ఒకింత సంతృప్తిగానే ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న అంశాల్లో ప్రధానమైనది సొంత పార్టీలోని కాపు నాయకుల తీరు.

 

 

 

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న బాబుకు అండగా ఉండాల్సిన అక్కడి బలమైన కాపు నాయకుడు తోట త్రిమూర్తులు చంద్రబాబుకు జలక్ ఇచ్చారు. బాబు పర్యటనను తోట త్రిమూర్తులు బహిష్కరించారనే వార్త జిల్లా రాజకీయాల్లో సంచలనమైంది. త్రిమూర్తులుతో పాటు టీడీపీ నేతలు, కార్పొరేటర్లు ఎవరూ హాజరుకాలేదు. ఇప్పుడే కాదు..  జిల్లా విస్తృత స్థాయి సమావేశం, నియోజకవర్గ సమీక్షలకు కూడా హాజరులేదు. ఇందుకు కారణాలు పరిశీలిస్తే.. పార్టీలోని కొందరి పోకడలు తమను బాధిస్తున్నాయని త్రిమూర్తులు బహిరంగంగానే వాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఖర్చుకు కూడా పార్టీ అధిష్టానం సహకరించలేదని ఆమధ్య వార్తలొచ్చాయి. ముఖ్యంగా ఈ జిల్లా నుంచి చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఓ నాయకుడు ఎన్నికల సమయంలో తమను పట్టించుకొలేదని కాపు నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కూడా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. దీంతో వీరంతా టీడీపీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. సాక్షాత్తూ చంద్రబాబే సమావేశాలకు రావాలని కబురు పంపినా త్రిమూర్తులు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

 

 

 

తోట వైసీపీలోకి వెళ్లిపోతున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనంతటికీ కారణం చంద్రబాబు కాపు నాయకులను పట్టించుకోకపోవడమే అనే వాదనలు లేకపోలేదు. టీడీపీకి కాపు నాయకులు దూరం కావడం వైసీపీకి బాగా లాభిస్తుంది. దీంతో ఇప్పటికే అనేక సమస్యల్లో ఉన్న టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్టవుతుంది. మరి దీనిపై టీడీపీ స్టాండ్ ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: