ఏపీ ముఖ్యమంత్రి జగన్ శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో అల్లాడుతున్న ఉద్దానం ప్రాంతానికి ఉపశమనం కలిగే రెండు కీలక ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఉద్దానానికి రక్షిత మంచి నీటి పథకం, రెండు వందల పడకల కిడ్నీ పరిశోధన కేంద్రం అండ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు. పాద యాత్ర సందర్భంగా తాను చూసిన, విన్న ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.


ఈ కిడ్నీ బాధితులకు తోడుగా ఉండేందుకు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్ని హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ తీసుకొస్తానన్నట్లు జగన్ పాదయాత్రలో చెప్పారు. ఆ రోజు చెప్పిన మాటను ఈ రోజు అక్షరాలా ఉద్దానంలో శంకుస్థాపన చేస్తున్నానని సగర్వంగా ఇవాళ జగన్ తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రస్తావిస్తూ   " డయాలిసిస్ జరుగుతోన్న పేషెంట్ లకు పది వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నామని మరియు పది వేల పెన్షన్ ను స్టేజ్ 5 అంటే డయాలసిస్ చేస్తా ఉన్న పరిస్థితుల్లో ఉన్న కిడ్నీ బాధితులకు అందజేస్తాము " అని తెలియజేశారు. కిడ్ని పేషెంట్ లకు స్టేజ్ 3 నుంచి పరిహారం అందజేస్తే డయాలసిస్ స్టేజ్ కి వెళ్ళక ముందే స్టేజ్ 3 నుంచి కూడా మందుల వాడకం ఎక్కువగా పెరుగుతుంది.



డాక్టర్ అప్పలరాజు అడిగిన కోరిక మేరకు స్టేజ్ 3 బాధితుల నుంచి ఒక స్పెషల్ ప్యాకేజీ కింద అయిదు వేల రూపాయల పెన్షన్ నమోదు చేస్తున్నామని జగన్ తెలిపారు. ఈ కిడ్నీ బాధితులకు ప్రభుత్వం పట్టించుకుంటా ఉంది అన్నది చెప్పడమే కాదు పెన్షన్ తీసుకుంటూ ఉన్నవాళ్లకు కూడా మేలు జరగాలని చూస్తున్నాము. అందుకనే ప్రతి ఐదు వందల సీకీడీ పేషెంట్ లకు ఒక హెల్త్ వర్కర్ ని కూడా ఈ రోజు నుంచి పెట్టడం జరుగుతుందని జగన్ పేర్కొన్నారు. ఉద్దానం ప్రాంతంలో ప్రజలకు కిడ్నీ సమస్యలు రావటానికి ప్రధానంగా రక్షిత మంచి నీరు లేకపోవడమే అని జగన్ చెప్పారు. అందుకే ఈ సమస్యను శాశ్వతంగా నిర్మూలించటానికి పలాస, ఇచ్ఛాపురం నియోజక వర్గాలకు రక్షిత మంచి నీటి పథకాన్ని కూడా తీసుకొస్తామంటున్నారు. ఈనేపధ్యంలో శంకుస్థాపన చేసి అక్కడ ఆరు వందల కోట్లు ఈ సమస్య కోసం ఖర్చు పెడుతున్నట్టు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: