ఇండియా చంద్రయాన్ 2 మిషన్ హడావుడిలో ఉన్నది.  మిషన్ ఫెయిల్ అయినా సరే శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నారు ప్రధాని, ప్రముఖులు, సామాన్య ప్రజలు.  భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మళ్ళీ చేసి ఇస్రో తిరిగి సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.  అటు అమెరికా, రష్యా వంటి ప్రపంచ దేశాలు కూడా ఇండియా చేసిన సాహసాన్ని మెచ్చుకుంటున్నాయి.  చంద్రుని దక్షిణ ధృవంపై  అడుగుపెట్టాలంటే మాములు విషయం కాదు.  ఆ సాహసాన్ని విజయం వరకు వెళ్ళి ఆగిపోయింది.  


అంతమాత్రం చేత అధైర్య పడాల్సిన అవసరం లేదని ప్రపంచదేశాలు ధైర్యం చెప్తున్నాయి.  ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నాయి.  అయితే, పొరుగున ఉన్న పాక్ మాత్రం తన బుద్దిని పోనిచ్చుకోవడం లేదు.  ఎప్పుడూ చేసినట్టుగానే ఇప్పుడు కూడా ఇండియాపై బురదజల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నది.  నిన్న పాక్ ఆర్మీ చీఫ్ కాశ్మీర్ గురించి కారుకూతలు కూశారు.  కాశ్మీర్ సాధనే తమ అజెండా అని చెప్పారు.  


ఆ తరువాత జమ్మూ కాశ్మీర్ గురించి పాకిస్తాన్ మరోమాట మాట్లాడింది.  జమ్మూ కాశ్మీర్ తమదే అని, దాన్ని దక్కించుకునే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని అంటున్నాడు.  ఇమ్రాన్ ఖాన్ వంటి వ్యక్తి చేయాల్సిన మాటలు కావు ఇవి.  బోర్డర్ లో నిత్యం అలజడులు సృష్టిస్తూ.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్, ఉగ్రవాద సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం అని చెప్పడం ఎలా ఉన్నది అంటే.. పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడటం లేదు అన్నట్టుగా ఉన్నది.  


ఇప్పటికే ప్రపంచ దేశాలు పాక్ ను మొట్టికాయలు వేస్తున్నాయి.  అంతర్గతంగా ఉన్న ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నాయి.  కానీ, ఈ హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు పాకిస్తాన్.  ఇండియాపై ఒంటికాలిపై లేవడమే లక్ష్యంగా పెట్టుకున్నది.  పాక్ కు చెందిన 17 ఏళ్ల కుర్రోడు ఆ దేశ ప్రధానిని ఉద్దేశించి ఇస్లామాబాద్ అభివృద్ధి గురించి ఆలోచించాలని హితవు పలికాడు అంటే అర్ధం చేసుకోవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: