ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 విఫలమైందని అంతా బాధపడుతున్నారు కానీ నిజానికి కేవలం 5 శాతం మిషన్ మాత్రమే ఫెయిల్ అయిందని ఎవరికి తెలియదు. విక్రమ్ లాండర్ క్రాస్ లాండింగ్ అయిందో లేదో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో మొత్తం చంద్రయాన్-2 ప్రయోగం పుర్తిగా దెబ్బతిన్నట్లు కాదని విశ్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేవలం సాఫ్ట్ లాండింగ్ కు ప్రయత్నిస్తున్నప్పుడు విక్రం ల్యాండర్ నుండి మన గ్రౌండ్ స్టేషన్ కు సిగ్నల్ కట్ అయింది అయితే చంద్రుడి చుట్టూ తిరిగే ఆర్బిటర్ మాత్రం ఏడాది రోజులు పని చేస్తుంది.

చంద్రునికి అతి సమీపంలోకి వెళ్లిన విక్రమ్ లాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కు యత్నించింది ఇప్పటి వరకు ప్రపంచ దేశాలలో ఈ తరహాలో చంద్రుని మీద అడుగుపెట్టేందుకు ప్రయత్నించి సఫలమైంది కేవలం 52 శాతమే. ఇప్పుడు మరొక 14 రోజుల పాటు చుట్టూ తిరిగే లాండర్ ఏదో ఒక క్షణంలో సంకేతాలు పంపింది అంటే శాస్త్రవేత్తలు మళ్ళీ విజయవంతంగా చంద్రయాన్-2 ను చిటికెలో తిరిగి ప్రారంభిస్తారు. అసలు సంకేతాలు రావడం ఎందుకు ఆగిపోయాయి అన్న విషయాన్ని తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ పొరపాటున సంకేతాలు కనుక చంద్రుడిచుట్టూ తిరిగే ఆర్బిటాల్ ద్వారా వచ్చినట్లయితే.... విక్రమ్ అప్పటికీ ధ్వంసం కాకుండా ఉంటే సాఫ్ట్ ల్యాండింగ్ కు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తారు.

ఒకవేళ అలా జరగకపోయినా.... ప్రపంచంలో ఏ దేశం సాధించని ఘనత మొట్టమొదటిసారిగా సాధించిన దేశంగా భారతదేశం ఉద్భవిస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తలకు ఇంకా 14 రోజుల వరకు అవకాశం ఉంది. 14 రోజులపాటూ ల్యాండర్ పైన సూర్యకాంతి పడుతుంది. అదే సమయంలో ల్యాండర్, రోవర్ 14 రోజులు పనిచేస్తాయి. అవి రెండు సోలార్ పవర్‌తో పనిచేస్తాయి కాబట్టి... సోలార్ పవర్ అయిపోగానే అవి పనిచేయడం మానేస్తాయి.

ఉపరితలంపైన తిరుగుతూ ఈ 14 రోజులు సౌరశక్తితో చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ప్రపంచంలోనే మొదటి సారి పరిశోధించబోతున్న మిషన్ మనదే. ఇలా 14 రోజులపాటు ల్యాండర్ మరియు రోవర్ మన స్పేస్ స్టేషన్ కు చంద్రుడి దక్షిణ ధ్రువం వైపు సమాచారాన్ని పంపిస్తూనే ఉంటాయి. కేవలం చంద్రుడి పైన అడుగు పెట్టలేకపోయాం కాని చంద్రుడిని ఎవరూ చూడని కొత్త కోణంలో మొదటిసారి చూస్తుంది మన భారతదేశమే.


మరింత సమాచారం తెలుసుకోండి: